ఢిల్లీలో పొలిటికల్ వార్ హోరాహోరిగా సాగుతుంది. అధికార పార్టీ బీజేపీ, ఆమాద్మీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటీపడి మరీ తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు.. ఈ దశలో ఢిల్లీ పీఠం ఎవరిని వరించబోతోందనే చర్చ వినిపిస్తుంది.. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికలపై పలు సంస్దలు సంస్థలు పోల్ నిర్వహించాయి. ఆ సర్వేలో హస్తినలో ఆమాద్మీనే మరోసారి అధికారం చేపడుతుందని తేలిందట.. ఢిల్లీలో వార్ వన్ సైడ్ అని.. కేజ్రీవాల్ చీపురు ప్రత్యర్థులను ఊడ్చేస్తుందని జోస్యం చెప్పింది.

 

 

ఇకపోతే ఈ చింతామణి 50-50 ఇచ్చిన సర్వే ప్రకారం ఆమాద్మీ పార్టీకి 40 నుంది 42 శాతం మెజారీటి రాగా 33 నుండి 37 వరకు సీట్లను గెలుపొందవచ్చునని తేల్చింది. ఇకపోతే బీజేపీకి 41 నుండి, 43% మెజారిటి రాగా 33 నుండి 37% స్దానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇక కాంగేస్ 7నుండి 9% తో 0 నుండి 3 సీట్లను గెలుచుకోవచ్చని తెలిపారు.. ఇదిలా ఉండగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఆమాద్మీ పార్టీకి 52శాతం ఓట్లు రావొచ్చు. ఇక బీజేపీ 34శాతం ఓట్లతో సరిపెట్టుకోనుంది. సీట్ల విషయానికొస్తే.. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమాద్మీ పార్టీకి 54-60 స్థానాలు దక్కవచ్చని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

 

 

ఇక బీజేపీ 10-14 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని వెల్లడించింది. 2015 ఎన్నికల్లో కేవలం 3 సీట్లే గెలిచిన బీజేపీ.. ఈసారి కాస్త పుంజుకుంటుందని అభిప్రాయపడింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11న ఫలితాలను ప్రకటిస్తారు. .. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన ఈసారి కూడా ఆమాద్మీ పార్టీనే ఢిల్లీ పీఠాన్ని చేపట్టడం ఖాయమని అనిపిస్తుంది. అని ఇప్పటికే కొందరు డిసైడ్ అయ్యారట. ఇకపోతే ఢిల్లీ పాగా వేయాలనుకుంటున్న బీజేపీకీ మాత్రం నిరాశే మిగులుతుందని అనుకుంటున్నారట కొందరు రాజకీయ పెద్దలు.. ఇకపోతే ఈ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని  సంపాదించుకోవాలని ఆప్ ప్రయత్నిస్తుంటే.. దాదాపు దేశం మొత్తం సంపాదించిన ఆధిపత్యాన్ని దేశరాజధానిలోనూ కొనసాగించాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: