ప్రస్తుతం చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికే చైనాలో ఏకంగా 90 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువాత పోరాడుతున్నారు. ఇక ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో.. ఈ వైరస్ సోకితే ప్రాణాలు పోవడం దాదాపు ఖాయంగా మారిపోయింది. చాలా తక్కువ మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారి నుండి బయటపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి పడి  3800 మంది మరణించారు. ఏకంగా లక్షా పదివేల మందికి ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక ఈ వైరస్ వ్యాప్తిచెందిన ఆయా దేశాలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాణాంతకమైన వైరస్ 90 దేశాలకు  పైగా వ్యాప్తి చెందింది. 

 

 

 అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పుడిప్పుడే చైనా దేశంలో తగ్గుముఖం పడుతూ ఉంటే అటువంటి దేశంలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఇరాన్  ఉత్తర కొరియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాల్లో  రోజురోజుకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ఇక ఇప్పటివరకూ ఇరాన్ దేశంలో 7601 మంది కరోనా  బాధితులు ఉండగా ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి 237 మంది మరణించారు. దీంతో అటు ఇరాన్  ఆర్థికంగా కూడా భారీగానే నష్టం వస్తుంది. అయితే కరోనా వైరస్ గురించి ఓ వైపు వైద్యులు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటే... మరోవైపు సోషల్ మీడియాలో తారస్థాయిలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒకరకంగా కరోనా  పైరసీ పై తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతూనే ఉంది. 

 

 

 ఈ క్రమంలోనే ఇరాన్ దేశంలో ఒక ప్రచారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరోనా  లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా మద్యం సేవిస్తే కరోనా  వైరస్ ను మియంత్రించవచ్చు  అంటూ ప్రచారం మొదలైంది. ఇక అప్పటికే కరోనా  ఎక్కడ వస్తుందో అని ప్రాణ భయంతో బతుకుతూ ఉన్నవారందరూ ఈ పుకారు కి కనెక్ట్ అయిపోయారు. ఇలా మద్యం తాగితే కరోనా  నియంత్రించవచ్చునని సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మి అతిగా మద్యం సేవించారు. దీంతో  అతిగా మద్యం సేవించిన వారు 27 మంది మృతి చెందారు. తమకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని భ్రమ పడి అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీని వైద్యులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: