డబ్బు మానవుని ఎంతటి వరకు అయిన తీసుకుపోగలదు. చేతిలో డబ్బులు ఉంటే బాగుంటుంది. లేదంటే స్నేహితులు లేదా బంధువుల నుంచి డబ్బు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. వారు డబ్బులు ఇస్తే పర్వాలేదు. ఒకవేళ ఇవ్వకపోతే ? అప్పుడు ఇంకేం చేయలేం. బ్యాంకులు లేదా ఇతర ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రుణం తీసుకోవాల్సిందే.

 

సిబిల్ స్కోర్‌పై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. సిబిల్ స్కోర్ ద్వారా మీ క్రెడిట్ హిస్టరీ తెలుస్తుంది. పర్సనల్ లోన్ వంటి అన్‌సెక్యూర్డ్ రుణాల విషయానికి వస్తే.. బ్యాంకులు లేదా ఇతర సంస్థలు కచ్చితంగా సిబిల్ స్కోర్‌కు ప్రాధాన్యమిస్తాయి. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 700 లేదా ఆపైన స్కోర్ ఉంటే మంచి స్కోర్ అని భావిస్తారు.

 

బిల్ పేమెంట్స్‌ను కరెక్ట్ టైమ్‌కు కడితే.. మీకు ఆర్థిక క్రమశిక్షణ ఉందని బ్యాంకులు భావిస్తాయి. లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు, యుటిలిటీ బిల్లు వంటి వాటిని కరెక్ట్ టైమ్‌కు చెల్లిస్తూ ఉండండి. దీంతో పర్సనల్ లోన్ సులభంగా పొందొచ్చు.

 

మీకు అవసరం అనుకుంటేనే రుణం కోసం దరఖాస్తు చేసుకోండి. లేదంటే వద్దు. తరుచుగా లోన్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటే మీరు ఈఎంఐలు కూడా ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. దీంతో మీరు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తారనే అభిప్రాయానికి బ్యాంకులు రావొచ్చు. అందువల్ల అవసరం లేకపోతే రుణానికి దూరంగా ఉండటం మంచిది.

 

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. లిమిట్ ఉంది కదా అని మొత్తంగా వాడేయవద్దు. మీరు క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే.. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. దీంతో మీ లోన్‌పై కూడా ఎఫెక్ట్ పడొచ్చు.

 

ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే వాటిని ఉపయోగించడం వల్ల నెల చివరిలో ఎక్కువ బిల్లు చెల్లించాల్సి రావొచ్చు. దీంతో కొన్ని సందర్భాల్లో బిల్లు చెల్లింపులను మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. దీంతో క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ఒకటి లేదా రెండు కార్డులను వాడితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: