దేశంలో కరోనా రోజు రోజు కు విజృంభిస్తున్న తరుణంలో మొదటి కేసు నమోదైన కేరళ లో మాత్రం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. నిన్నకేవలం రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు మరో మూడు కేసులు నమోదయ్యాయని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఈరోజు 19మంది పూర్తిగా కోలుకున్నారని దాంతో యాక్టీవ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందన్న విజయన్ ... రోజుకు1000కి పైగా శాంపిల్ టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఇప్పటివరకు కేరళ లో 378 కేసులు నమోదు కాగా అందులో 178 కేసులు యాక్టీవ్ గా వున్నాయి కాగా 198 మంది కోలుకోగా ఇద్దరు మరణించారు. 
 
ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. మొన్నటి వరకు కేసులు తగ్గతున్నాయనిపించగా ఒక్కసారిగా మళ్ళీ కేసులు సంఖ్య  పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈఒక్క రోజే తెలంగాణ లో 32 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఓ కరోనా మరణం చోటు చేసుకుంది. దాంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 531కు చేరగా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 19కేసులు  నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 439 కు చేరింది. ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 9000 దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: