భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న వేళ అక్క‌డ‌క్క‌డా లాక్‌డౌన్‌పై నిర‌స‌న వ‌క్త‌మ‌వుతూనే ఉంది. మంగ‌ళ‌వారం మ‌హారాష్ట్ర  బాద్రాలో  వ‌ల‌స కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఇలా ఆందోళ‌న చేసిన వారిలో ఎక్కువ‌మంది ఉత్తర భార‌త దేశానికి చెందిన‌వారే ఉండ‌టం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్‌ను సుధీర్ఘ‌కాలంపాటు అమ‌లు చేయ‌డంతో తాము తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ భార్య బిడ్డ‌ల‌ను వ‌దిలి ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇక్క‌డ ఉండ‌లేమ‌ని కొంత‌మంది ఏడుస్తూ త‌మ బాధ‌ను వెల్ల‌డిస్తున్నారు.  అయితే ప్ర‌భుత్వం ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేయ‌కుండా లాక్‌డౌన్ తేవ‌డంతో తాము చాలా క‌ష్టాలు ఎదుర్కొంటున్నా మ‌ని వేద‌న చెందుతున్నారు.

 


అయితే ఆందోళ‌న‌కు దిగిన‌వారంతా కూలీలేనా..?అన‌్న అనుమానాలను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.లాక్‌డౌన్‌పై స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చాకా కూడా అంత భారీ సంఖ్య‌లో కూలీలు ఏవిధంగా రోడ్ల‌పైకి వ‌చ్చార‌నేది ఇప్పుడు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని వేధిస్తున్న ప్ర‌శ్న‌. బాధ్యతగా సామాజిక దూరం పాటించాల్సిన అక్కడి ప్రజలు.. ఒకేసారి వందలాది మందిగా బాంద్రా రైల్వేస్టేషన్‌కి రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వలస కూలీలను ఎవరైనా తప్పుదోవ పట్టించారా..? అనే కోణంలోనూ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.  మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికే క‌రోనా కేసులు వేలాదిగా న‌మోద‌వుతున్న వేళ వ‌ల‌స కూలీల ఆందోళ‌న పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంది.


ఇదిలా ఉండ‌గా ఇదే విష‌యంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి కర్ఫ్యూని విధించాలనే ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించాడు. ‘‘అందర్నీ ఇంట్లోనే ఉంచాలంటే ఉన్న ఏకైక మార్గం కర్ఫ్యూ. బాంద్రాలో జరిగిన ఘటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రజలు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదు. వారితో పాటు మిగిలిన వారి జీవితాల్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు’’ అని హర్భజన్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారత్‌లో బుధవారం ఉదయానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,487కి చేరుకోగా.. ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 2,684 కేసులు నమోదయ్యాయి.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: