కరోనా వైరస్ నివారణ చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. గత నెల రోజులకు పైగా దేశం మొత్తం లాక్ డౌన్ నిర్బంధంలో ఉండటంతో ఎక్కడికక్కడ పనులు అన్ని రంగాలు క్లోజ్ అయిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనుల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి చాలా గట్టిగా పహారా కాస్తున్నాయి.

 

ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడం తో ఎవరికి వాళ్లు ఇళ్ళల్లోనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడు పోలీసులు ఆంధ్ర కి మరియు తమిళనాడు కి సరిహద్దు లో నడిరోడ్డుపై గోడలు కట్టేస్తున్నారు. దీంతో తమిళనాడు పోలీసులు చేస్తున్నఈ పని పట్ల సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా నెటిజన్లు బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది జాగ్రత్త లా లేదు అంటూ కొంత మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

ఈ విధమైన జాగ్రత్త ముందు నుండే తమిళనాడులో పాటిస్తే ఆ రాష్ట్రంలో వైరస్ ఆ విధంగా ప్రబలదు కదా అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు.ఈ విషయం నడుస్తూ ఉండగానే తమిళనాడు పోలీసులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: