లాక్‌డౌన్ త‌ర్వాత ప్ర‌జా ర‌వాణాను కొన‌సాగించ‌డం అన్న‌ది కేంద్ర,  రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మార‌నున్న‌ది.  ప్ర‌యాణాల్లో వ్య‌క్తిగ‌త దూరం పాటించేలా చూడాల‌ని కేంద్రం భావిస్తోంది. అయితే ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. త‌ప్ప‌నిస‌రి చేయాల్సి వ‌స్తే మాత్రం ఎక్కువ స‌ర్వీసులు త‌క్కువ మంది ప్ర‌యాణికులు..ఎక్కువ వ్య‌యాల‌తో సంస్థ‌లు ఆర్థికంగా న‌ష్టాలు ఎదుర్కొక త‌ప్ప‌దు. చాలా రాష్ట్రాల ఆర్టీసీలు న‌ష్టాల బాట‌లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అదే బాట‌లోనే ఉన్నాయి. అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఇటీవ‌ల చార్జీల పెంపుతో తేరుకుని లాభా న‌ష్ట‌లేమీ అన్న‌ట్లుగా నడుస్తోంది. 

 

అయితే కేంద్రం సూచ‌న‌లు పాటించి న‌ష్టాల‌ను భ‌రించేకంటే... ప్రైవేటు ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను లేదా వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ రాక‌పోక‌ల‌కు అనుమ‌తివ్వ‌డం ఉత్త‌మ అన్న ఆలోచ‌న‌తో ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ప్ర‌జార‌వాణాను కొద్దిరోజులు నిలిపివేయ‌డమే ఉత్త‌మం అన్న అభిప్రాయంలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే  ప్రజారవాణా వ్యవస్థను ఆదుకునేందుకు ఆలోచ‌న‌లు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ త‌ర్వాత బస్సుల్లో వ్యక్తిగత దూరాన్ని పాటించాలన్నది కేంద్రం సూచన. 

 

ఆ నిబంధనను అమలు చేయాలా? లేదా? చేస్తే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?  ఇంకా ఏమైనా ప్ర‌త్యామ్నాయ మార్గాలున్నాయా..? వ‌ంటి అంశాల‌పై మంగ‌ళ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల అసోసియేషన్‌ (ఏఎస్‌ఆర్టీయూ)ను  అధ్య‌య‌నానికి ఆదేశించింది. కరోనాతో డిపోల‌కే బ‌స్సులు ప‌రిమితం కావ‌డం..జీతాల చెల్లింపులతో ఆర్థికంగా ఆర్టీసీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి. ఈనేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల ఆర్టీసీల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం భారీగా ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే  ప్యాకేజీ ఇవ్వ‌డం జ‌రుగుతుందా..?  దానికి ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న‌గా రాయితీలు ప్ర‌క‌టిస్తుందా అన్న‌ది వారంలోపు తేలుతుంద‌ని స‌మాచారం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: