ప్రస్తుతం చాపకింద నీరులా ప్రపంచం మహమ్మారి  కరోనా  ప్రపంచ దేశాలలో  శరవేగంగా విస్తరిస్తూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలోని అగ్ర రాజ్యాల్లో  మెరుగైన వైద్య చికిత్సలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాయి . రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడి చనిపోతున్నా వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చే నెలలు గడిచి పోతున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కి ఇప్పుడు వరకు విరుగుడు కనుగొన లేకపోయినా ఈ విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఈ మహమ్మారి కి విరుగుడు మాత్రం కనుగొనలేకపోయారు శాస్త్రవేత్తలు. 

 

 ఎన్ని పరిశోధనలు చేసినా అవి సత్ఫలితాలను ఇవ్వటం లేదు . అయితే ప్రపంచ దేశాల ప్రజానీకం మొత్తం ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ ప్రభావంతో   బెంబేలెత్తిపోతున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ మహమ్మారి వైరస్ ను పూర్తిగా నివారించాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని పరిశోధకులు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ   భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. 

 

 

 ప్రస్తుతం కరోనా వైరస్ కు విరుగుడు కనుగొనేందుకు పరిశోధనలు జరుపుతున్న వ్యాక్సిన్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కు  ఇక ఎప్పటికీ వాక్సిన్ రాకపోవచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే చాలా  వైరస్లకు వ్యాక్సిన్ లేదని... అలాగే కరోనా వైరస్ విషయంలో కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవు అంటూ స్పష్టం చేశారు ఆయన. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలతో ప్రజల్లో కరోనా  వ్యాక్సిన్ పై  ఆశలు చిగురిస్తున్న ప్పటికీ... అంతిమంగా వాక్సిన్  సమర్థవంతంగా వైరస్ పై  పోరాడలేక పోతున్నారు డాక్టర్ నబర్రో  వ్యాఖ్యానించారు. కాగా నబర్రో  చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: