తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెల నుంచి కరోనా కేసులు మెల్లి మెల్లిగా పెరుగుతూ ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొదట్లో ఒకటీ రెండూ మహా అంటే పది కేసులు నమోదు కాగా... ఇప్పుడు ముప్ప నుంచి డెబ్బై వరకు కేసులు నమోదు అవుతున్నాయి.  అయితే కోవిడ్ 19 పై ఏపిలో యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రతిరోజూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కోవిడ్‌-19 నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే.  

 

ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ..  జనాల్లో భయాందోళనలు తగ్గాలని అన్నారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలని, అలా జరగాలంటే ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు.  కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చే పరిస్థితి తీసుకురావాలని, అప్పుడే వైరస్‌ను అరికట్టగలుగుతామని అన్నారు.   కోవిడ్‌-19 విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని, ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని సీఎం అధికారులను కోరారు.

 

ఇక వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషించబోతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విధానం, మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ విధానం ఈరెండు కూడా చాలా ముఖ్యమైనవని సీఎం స్పష్టం చేశారు. ఈ రెండు విషయాల్లో సమర్థవంతంగా రైతు భరోసా కేంద్రాలు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: