కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో ఎక్కువగా కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరోపక్క చేతిలో పనిలేదు ఊరు గాని ఊరు కావటంతో వలస కూలీలు ధైర్యం చేసి కాలినడకన వేల కిలోమీటర్లు నడుస్తూ లాక్ డౌన్ సమయంలో దేశంలో దర్శనమిచ్చారు. చాలావరకు ఇతర రాష్ట్రాలు వలస కూలీల పై లాఠీచార్జీలు మరియు ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేశాయి. రాష్ట్ర సరిహద్దులు క్లోజ్ అవటంతో ఎవరిని కూడా రాణించే పరిస్థితి వలస కూలీ లకు చేయలేదు పోలీసులు. అయితే మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన శ్రామిక రైళ్లు తిప్పి వలస కూలీల ను గమ్యస్థానాలకు చేర్చింది కేంద్ర ప్రభుత్వం.

 

ఇదిలా ఉంటే దేశ సరిహద్దులు దాటి ఇప్పుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రవేశించిన వారికి వలస కూలీల కు ఉచితంగా అన్నపానీయాలు అందజేస్తూ వారికి ఫ్రీగా తమ గమ్యస్థానాలకు చేర్చడానికి జగన్ సర్కార్ బస్సులు ఏర్పాటు చేయడంతో పాటుగా వైద్య పరీక్షలు చేస్తూ వారిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. దీంతో జగన్ సర్కార్ వలస కార్మికుల విషయంలో అవలంభిస్తున్న తీరు జాతీయ మీడియాలో వైరల్ న్యూస్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సొంత రాష్ట్రం ప్రజలనే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఆదుకోవడానికి జగన్ ముందుకు రావడం పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఈ సందర్భంగా వలస కార్మికులు ఏపీలో సహాయం పొందిన కూలీలు నిజంగా జగన్ మంచి ముఖ్యమంత్రి అని పొగుడుతున్నారు. మా కష్టాన్ని బాధని అర్థం చేసుకుని మా కాళ్ళకి కూడా చెప్పులు అందిస్తున్నారని, కడుపుకి అన్నం పెడుతున్నారని, ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించారని చేతులెత్తి దండం పెడుతున్నారు. ఈ రాష్ట్రానికి చెందిన వాళ్లం కాకపోయినా గానీ ఆంధ్ర వాళ్ళు మధ్యలో మాకు బాగా భోజనం సదుపాయం కల్పించారని కూడా ఏపీ ప్రజలపై వలస కూలీలు బాగా పొగిడారు. ఇతర రాష్ట్రాలలో అంతగా ఆదరణ లేదని ఆంధ్ర వాళ్ళు బాగా ఆదరించారని అందుకే ఇంత మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారని వలస కూలీలు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: