దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా 5,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో మే 31వ తేదీ వరకు మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. కేంద్రం లాక్ డౌన్ పొడిగించడం గురించి అసరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తాజాగా అసరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోని తన నివాసంలో జాతీయా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ మాట్లాడుతూ బహుళ ప్రయోజనాలతో కూడిన సరికొత్త విధానం ఈ దేశానికి అవసరమని చెప్పారు. కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. లాక్ డౌన్ ప్రణాళికా రహితంగా అమలవుతోందని అన్నారు. 
 
కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఉండటం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒక వర్గానికి చెందిన ప్రజలను కరోనాకు బాధ్యలను చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు అనే ధోరణిని అనుసరిస్తోందని అన్నారు. అసరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు లాక్ డౌన్ ను పొడిగించకుడా కరోనాను ఎలా కట్టడి చేయాలని ఒవైసీ చెప్పాలని కామెంట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు నెహ్రూ పాక్ భారత్ భూభాగాన్ని కబ్జా చేసినా వదిలేశారని, బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భారత్ లో కలుస్తామన్నా అంగీకరించలేదని, కశ్మీర్ ను భారత్ లో కలుపుదామని చెబితే వద్దంటూ ఐక్యరాజ్యసమితికి లెటర్ ఇచ్చారని ఆయన వల్లే ఈరోజు సరిహద్దుల్లో ఎక్కువ ఖర్చు చేయాలని వస్తోందని దేశంలో పరిపాలన బాగానే సాగుతున్న సమయంలో విజన్ లేకుండా నిర్ణయాలు తీసుకున్న నెహ్రూ లాంటి నాయకుడు కావాలని ఒవైసీ ఎందుకు కోరుకుంటున్నాడో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: