ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసిపి మంచి దూకుడు మీద ఉండడంతో, ఒక్కొక్కరు ఇప్పుడు వైసిపి వైపుగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ తాజాగా ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకిపై రకరకాల కారణాలు చెబుతున్నప్పటికీ, ఆయన వైసీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయిన తరువాత మాత్రమే విజయ సాయి రెడ్డిని కలిసి చర్చించినట్లు సమాచారం. వైఎస్ హయాంలో ఆదిశేషగిరిరావు కాంగ్రెస్ లో ఉంటూ వైఎస్ కు సన్నిహితంగా మెలిగారు. 

IHG


ఇక ఆ తరువాత టిడిపిలో చేరారు. టీడీపీలోకి వెళ్ళినా, ఆయన అక్కడ ఇమడలేకపోవడంతో పాటు, తాను ఆ పార్టీలోకి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఆయన పదే పదే తన సన్నిహితుల వద్ద తమ బాధను కూడా వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేందుకు వైసీపీలో చేరాలని ఆయన డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలకు ముందు నుంచే సూపర్ స్టార్ కృష్ణ వైసిపికి అనుకూలంగా ప్రకటన చేస్తూ వచ్చారు. తన అల్లుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసినా, ఆయన కు మద్దతు తెలపడం గాని, ప్రచారం చేయడం కానీ చేయలేదు.

 


 కానీ వైసిపికి అనుకూలంగానే మాట్లాడారు. ఇప్పుడు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక గల్లా జయదేవ్ కూడా టిడిపిలో ఉన్నా, ఆయన ఆ పార్టీ పై అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదిశేషగిరిరావు వైసీపీ వైపు రావాలి అనుకోవడం వెనుక కారణాలు ఏంటనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇక మొదటి నుంచి మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ తరపున ఎన్నికల ప్రచారానికి వస్తారని ప్రచారం జరిగినా, ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ వైపు మహేష్ చిన్నాన్న అడుగులు వేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: