ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బలహీనంగా ఉన్న తరుణంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవహారం ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో అగ్ర నేతగా ఉన్న ఆయనను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు టీడీపీ నేతలకు ఏ మాత్రం కూడా మింగుడు పడటం లేదు అని చెప్పవచ్చు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు, అధికార ప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా అచ్చెన్న పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన వాయిస్ వినిపించారు. నాడు అసెంబ్లీలోనూ, బ‌య‌టా అప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓ రేంజ్‌లో ఆటాడుకునే వారు. ఇక ఇప్పుడు అచ్చెన్న అవినీతిని అంతా జ‌గ‌న్ బ‌యట పెడుతున్నారు.

 

ఇదిలా ఉంటే టీడీపీ అగ్ర నేతగా ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు అంటే మా పరిస్థితి ఏంటీ అని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మీద కేసులు ఉన్నాయి. అదే విధంగా ప్రకాశం జిల్లా గొట్టిపాటి రవికుమార్ మీద కూడా కేసులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా పార్టీలో భయపడే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు చంద్రబాబు ముందు తమ ఆవేదన మొత్తం కూడా వాళ్ళు పెట్టారు అని సమాచారం. తాము తట్టుకోలేకపోతున్నామని వ్యాపారాలు లేకపోతే అప్పుల పాలవుతామని ఆవేదనగా ఉన్నారట. 

 

గొట్టిపాటి అయితే నేను ఎక్కువ కాలం ఇదే పరిస్థితి ఉంటే రాజకీయం చేయలేను అని చెప్పారట. తనకు ఆర్ధికంగా ఇబ్బందులు వస్తే మాత్రం కొనసాగడం కష్టం అని చెప్పడంతో చంద్రబాబు కూడా ఆయన విషయంలో ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు. వెలగపూడి మీద పాత కేసులను తోడే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఆయన కూడా భయపడుతున్నారట మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: