పార్క్ హయత్ హోటల్ వేదికగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ కావడం గురించి ఏపీ రాజకీయ వర్గాల్లో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన వీరు ముగ్గురూ సమావేశమై దాదాపు గంట సమయం పాటు చర్చించారు. విడివిడిగా కలిశామని.... ముగ్గురం కలిసి కూర్చోలేదని వారు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం ప్రత్యక్షంగా స్పందించకపోకపోయినా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లపై సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. 
 
సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరినా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పలు సందర్భాల్లో బీజేపీ నేతలే వ్యాఖ్యలు చేశారు. రహస్య భేటీ వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారిందని... సుజనా, కామినేని టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఫిర్యాదులు కూడా బీజేపీకి వెళ్లినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాత్రం వాళ్లకు పరిచయాలు ఉన్నాయని సమావేశం సాధారణమైనదేనని చెప్పారు. 
 
వైసీపీ ఈ సమావేశాన్ని కావాలనే రాధ్ధాంతం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. అయితే నిమ్మగడ్డ మాత్రం ఈ సమావేశం విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. నిమ్మగడ్డ గతంలో కేంద్ర హోం శాఖకు మొదట్లో లేఖ రాయలేదని చెప్పడం తర్వాత రాశానని చెప్పడం జరిగింది. అయితే ఈ భేటీ విషయంలో ఏం మాట్లాడినా విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించి నిమ్మగడ్డ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. 
 
అయితే అందరూ సైలెంట్ గా ఉన్నా టీడిపీ మాత్రం ముగ్గురు నేతల భేటీ విషయంలో సీరియస్ గానే స్పందించింది. నిమ్మగడ్డను కావాలని ఇరికించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ పై టీడీపీ బ్రాండ్ వేయాలనే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిమ్మగడ్డతో బీజేపీ నేతలు భేటీ కావడం గురించి లీగల్ గా ఎలాంటి సమస్య లేకపోయినా నిమ్మగడ్డకు బీజేపీ నేతలకు సత్సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో కలుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: