దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా వైరస్, వ్యాక్సిన్ గురించి జరుగుతున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు వైరస్ కు సంబంధించిన మరికొన్ని లక్షణాలను తాజాగా గుర్తించారు. 
 
గతంలో శాస్త్రవేత్తలు జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు అనిపిస్తే కరోనా కావచ్చని చెప్పారు. అయితే తాజాగా ఒళ్లునొప్పులు, వికారం లాంటి లక్షణాలు ఉన్నా కూడా కరోనా కావచ్చని.... ఈ లక్షణాలు కనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొందరు బాధితుల్లో వెన్నునొప్పి, కడుపు నొప్పి, మోకాలి కింది భాగంలో నొప్పి, దద్దుర్లు లాంటి సమస్యలను తాము గుర్తించామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
కొందరిలో డయేరియా సమస్య కనిపిస్తోందని..... కరోనా బాధితుల్లో ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందంలోని సభ్యుడైన డాక్టర్ శశాంక్ జోషి వెల్లడించారు. కరోనా పరీక్షలకు ముందు 200 మంది అనుమానితులకు చికిత్స అందించిన డాక్టర్ జలీల్ వెన్నునొప్పితో బాధ పడ్డారని చెప్పారు. షుగర లెవెల్స్ అదుపు తప్పినా కరోనా కావచ్చని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.       
 
షుగర్ రోగులు కరోనా భారీన పడితే వారికి అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ ముక్కు కారడం, వాంతులు, లాంటి వాటిని కరోనా లక్షణాల జాబితాలో చేర్చింది. ఐ.సీ.ఎం.ఆర్ రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలను ఈ జాబితాలో చేర్చింది. సహజంగా అలసట, పొడిదగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని.... వీటికి అదనంగా కొత్త లక్షణాలు కనిపిస్తాయని వాళ్లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: