విజయవాడ ఫ్లై ఓవర్ ప్రారంభం సందర్భంగా సిఎం  వైఎస్ జగన్ కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీ ముందు పలు విజ్ఞప్తులు పెట్టారు. రోడ్ల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సిఎం వైఎస్ జగన్ అన్నారు. కేంద్రం నిర్మించే 22 గ్రీన్ ఫీల్డ్ రహదారుల్లో 6 గ్రీన్ ఫీల్డ్ రహాదారులు ఏపీ గుండా వెళ్లనున్నాయని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల కనెక్టివిటీ కోసం రహాదారులకు అనుమతులిచ్చారని ఆయన పేర్కొన్నారు. రూ. 2611 కోట్లను రోడ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో కేంద్రం కేటాయించిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ నిధులను విడుదల చేయలేదని, మొదటి, రెండు విడతల్లో రావాల్సిన రూ. 680 కోట్లు, రూ. 820 కోట్లు విడుదల చేయాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.

పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విజయవాడకు బైపాస్ రోడ్ల అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమం వైపు ఓ బైపాస్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతోందని వివరించారు. విజయవాడ తూర్పు వైపున మరో బైపాస్ రోడ్ నిర్మించాల్సి ఉందని వివరించారు. 78 కిలోమీటర్లతో తూర్పు బైపాస్ నిర్మించాల్సి ఉంటుందని, ఇందులోనే కృష్ణా నదిపై వంతెనను మొదటి దశలో నిర్మించాల్సి ఉంటుందన్నారు. బందరు పోర్టుకు ఈ బైపాస్ రోడ్  అనుసంధానంగా ఉంటుందని తెలిపారు.

విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు అనుమతి కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణలో రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా కేంద్రమే అనుమతివ్వాలని కోరుతున్నామని చెప్పారు. బెంగళూరు-విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ రహాదారిని మొదటి దశలో ప్రారంభించేలా చూడగలరని ఆయన కోరారు. దీని వల్ల రాయలసీమకు విజయవాడకు కనెక్టివిటీ పెరుగుతుందని, అనంతపురంలో ఎన్ హెచ్ 42 విస్తరణకు రూ. 224 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణానికి నిధుల అవసరం ఉందన్నారు. తీర ప్రాంత ప్రాంతాల కనెక్టివిటీ.. ఐదు పోర్టులకు అనుసంధానం కోసం నిధులు కేటాయించగలరని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: