కరోనా మహమ్మారి కారణంగా సాధారణ ప్రజల నుంచి పెద్ద వాళ్ళు అయిన కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కట్టిడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. దాదాపుగా ఐదు నెలల వరకు లాక్ డౌన్ కొనసాగింది. కేవలం నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి తప్ప వేరే ఏ ఇతర పనులకు బయటకు వచ్చిన పోలీసులు లాఠీలతో పని చెప్తున్నారు. లేదా కరోనా నియమాలను అనుసరించనీ వారి పై భారీ జరిమానాతో పాటుగా క్రిమినల్ చర్యలను కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రాల ఆర్థిక నిధికి గండి పడటంతో అన్ లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది. 



లాక్ డౌన్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు బాగా గండి పడింది. ఆఫీస్ కు రాలేని పరిస్థితి ఉండటంతో కొన్ని వాణిజ్య కంపెనీలు జీతాలను ఇవ్వలేమని చేతులు దులుపుకున్నారు. మరి కొన్ని కంపెనీలు వర్క్ ను ఇంట్లో నుంచే చేయించుకుంటూ ఏ మూడు నెలలకో గానీ జీతాలను చెల్లించలేని పరిస్థితి. దీంతో చాలా మంది హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో నిరుద్యోగులు గా మారారు. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు అదే దుస్థితి..



తాజాగా ప్రభుత్వం సాప్ట్ వేర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా కొంతవరకు తగ్గడంతో కొన్ని ఆఫీసుకు తెరుచుకున్నాయి. మైక్రో సాప్ట్ లాంటి వాణిజ్య కంపెనీలు మాత్రం శాశ్వతంగా ఇంటికే పరిమితం చేసింది.  కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే ఆఫీసులకు రమ్మని చెబుతున్నారు. మరి కొన్ని కంపెనీలు మాత్రం వారానికి ఒకటి , రెండు ఆఫీసులకు వచ్చి పని చేయమని ఇటీవల కాలంలో ఆదేశించారు. తాజాగా మరో కంపెనీ ఈ నిర్ణయాన్ని పాటించాలని పిలుపునిచ్చింది. ఎచ్ సీఎల్ కంపెనీ లు వారంలో ఒకసారి కంపెనీలో పని చేయాలని నిర్ణయించింది. మొదటి వారం ఒకరోజు, రెండో వారం రెండు రోజులు, ఇలా వారం వారం పరిస్థితులను పెంచుకుంటూ వస్తారని ఆయా కంపెనీ యాజమాన్యాలు వెల్లడించారు. మరి ఈ కంపెనీ దారిలో ఎన్ని కంపెనీలు వచ్చి చెరతాయో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: