ఈ తరం యువత ఎలా ఉన్నారంటే ఏది చేయొద్దని అంటామో వాటినే ఎక్కువగా చేస్తారు. అందుకే ఇప్పటి యువతకు కాస్త దూకుడు ఎక్కువ అంటారు. అయితే భారత దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాలకు కారణం యువత అని పోలీసులు అనేక సార్లు చెప్పారు. మన తెలుగు రాష్ట్రాల తో పోలిస్తే మిగితా రాష్ట్రాల్లో యువత చేసే నేరాలు లెక్క లేకుండా పోయాయని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో యువత చేసే క్రైమ్ రేటు మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. అమ్మాయిల పై దాడి, లేదా దోపిడీలు.. అది లేదంటే ఎవరొకరి పై చెయ్యి చేసుకోవడం..



తాజాగా మహారాష్ట్ర లో ఒక అమానుష చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్‌ని చెందిన ఇద్దరు టీనేజర్లు కుక్కని కర్రతో కొట్టి కిరాతకంగా చంపేశారు. ఆ దారుణాన్ని మరొకరు వీడియో తీయడం తో వైరల్‌గా మారింది. ఒక యువకుడు కర్రతో కుక్క తలపై దారుణంగా కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత కళ్లు పీకి దారుణంగా చేశారు.. ఆ ఘటన చూస్తున్న ఘటనను అందరికీ కన్నీరు తెప్పిస్తుంది.




స్నేహితుడి దుశ్చర్యని మరో యువకుడు సెల్‌ఫోన్ వీడియో తీశాడు.ఈ విషయం పై స్పందించిన అనిమల్ లవర్స్ విపరీతంగా కోపాన్ని తెప్పించింది.. జంతువుల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఓ ఎన్జీవో సదరు యువకుల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్కని కిరాతకంగా చంపేసిన యువకుల పై కఠిన చర్యలు తీసుకోవాలిన పోలీసులను డిమాండ్ చేశారు. అంత మూర్ఖంగా ప్రవర్తించిన వారి కూర్రత్వన్ని బయట పెడుతుంది.  అలాంటి వారిని సమాజంలో ఉండనివ్వకూడదని అంటున్నారు.ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే యువకులకు మానసిక వైద్యం అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ కేసు పై నమోదు చేసుకున్న పోలీసులు జంతు హింస కింద కేసు నమోదు చేసి యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..


మరింత సమాచారం తెలుసుకోండి: