సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు మీడియా సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికలు టీఅర్ఎస్, బీజేపి పార్టీలకు  ప్రస్టేజ్ గా మారిందని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీ అర్ ఎస్ వుంది కాబట్టి... బీజేపీ, టీఅర్ఎస్  పార్టీలు ప్రెస్టేజ్ అని చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు ఇంట్లో సోదాలు చేసే ముందు నోటీస్ ఇచ్చామని పోలీస్ లు ఇవ్వలేదని బీజేపీ వాళ్లు చెబుతున్నారన్నారు.

బీజేపీ వాళ్ళు పోలీస్ అధికారులే తమ ఇంట్లో డబ్బులు పెట్టారని కొత్త ఆనవాయితిని మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. పోలీస్ వాళ్లకు ఎక్కడైనా డబ్బులు దొరికితే తీసుకునే అలవాటు ఉంది కాని పెట్టే అలవాటు లేదు బీజేపీ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. నా 42 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మాట వినడం మొదటిసారన్నారు. నయిం లాంటి కేసులో కూడా కోట్ల రూపాయలు దొరికితే ఇప్పటవరకూ లెక్కచెప్పలేదు పోలీసులు అని ఆయన అన్నారు. ఎవరికైనా డబ్బులు దొరికితే చుపెడతరా...? జేబులో పెట్టుకుంటారు కానీ అంటూ ఆయన ప్రశ్నించారు.

ఇటు బీజేపీ నాయకుల మాటలు , అటు పోలీసుల మాటలు వింటుంటే ఇద్దరి మాటలు దొంగ మాటలే అన్నారు. ఇప్పటికే అన్ని కుల సంఘాలకు టీఅర్ఎస్ పార్టీ డబ్బులు పంచిందని ఆయన పేర్కొన్నారు. టీఅర్ఎస్ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి  నీళ్లు మాత్రమే ఇచ్చింది నిధులు, నియామకాలు మర్చిపోయిందని విమర్శించారు. దుబ్బాక ప్రాంతంలో టీ అర్ ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. సిద్దిపేట అభివృద్ధికి దుబ్బాక అభివృద్ధి చూస్తే అర్ధమవుతుందని ఆయన మండిపడ్డారు. ఆ రోజుల్లో ముత్యం రెడ్డి చేసిన అభివృద్ది తప్ప దుబ్బాక లో ఎం అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఎవరికి కూడా ఇవ్వలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: