అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. జగన్ దెబ్బకు కుదేలయిపోయిన టీడీపీ ఇప్పటికి కోలుకోలేదంటే జగన్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..  గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు.. ఇక టీడీపీ ని పూర్తి గా తుడిచిపెట్టుకుని పోయే విధంగా బీజేపీ పార్టీ ఏపీ లో పాతుకుపోతుంది.. సోము వీర్రాజు వచ్చాక ఈ మార్పు చాల కనిపిస్తుంది..

అయితే రాష్ట్రంలో ఏ చిన్న సమస్య అయినా బీజేపీ పార్టీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది.. కానీ స్థానిక ఎన్నికల విషయంలో ఇంకా నోరు మెదపకపోవడం ఇప్పుడు అనుమానాలకు దారితీస్తుంది. అధికార పార్టీ కి, ఎన్నికల కమిషన్ కు సమస్య కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీ ఇందులో చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీగా బీజేపీకి ఏ రాష్ట్రం పైన అయిన కొంత బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ లోజరిగిహీ స్థానిక ఎన్నికల విషయంలో ఓ స్పష్టమైనఅభిప్రాయం వెల్లడించాల్సి ఉంది. వాయిదా పడిన సమయంలో.. బీజేపీ నేతలపై కూడా.. వైసీపీ నేతలు దాడులు చేశారు. అప్పట్లో చాలా రచ్చ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలన్న వాయిస్‌ను బలంగా వినిపించలేకపోతున్నారు. బహుశా… వైసీపీ విధానమే.. తమ విధానమని.. రేపో మాపో… విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు హింట్ ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: