దుబ్బాక ఉప ఎన్నికలలో భాగం గా దౌల్తాబాద్ లో ఏర్పాటు చేసిన గొల్లకుర్మల సమావేశం లో పాల్గొన్న బిజెపి నేత రఘునందన్ రావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ మాట్లాడుతూ... పాస్పోర్ట్ ల బ్రోకర్ కేసీఆర్, అనేకంది నిరుద్యోగులను ముంచి కోట్లు సంపాదించారు అంటూ ఆయన ఆరోపణలు చేసారు. కులాలను అడ్డు పెట్టుకొని మంత్రి పదవి సాధించి కులాలను నట్టేట ముంచి కేసీఆర్ మోకాళ్ళ కాడ మొకరిల్లే పరిస్థితి తెలంగాణ మంత్రులది అని ఆయన మండిపడ్డారు.

నీచమైన అవినీతిపరుడు అయిన తెలంగాణ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు దేశమే ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అని ఆయన ఆరోపించారు. బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి నట్టేట ముంచుతున్నాడు అని విమర్శించారు. గోర్లు ఇచ్చి గొర్లకాపారులుగానే ఉండాలని పన్నాగం పన్ని గొర్ల కుర్మలకు మోసం చేస్తూన్నాడని అన్నారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చెస్తే బిజెపి పార్టీ అడ్డుపడిందని... ఫామ్ హౌస్ ముట్టడి చేస్తామంటే ఆ ప్రయత్నాన్ని ఆపుకున్నారన్నారు.

కొండగట్టు లో ఆర్టీసీ బస్సు ప్రమాదం లో పేదలు మరణిస్తే ఆ విషయం పై ముఖ్యమంత్రి మాట్లాడలేదు అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఇండ్లు నీట మ్యూనిగితే ఆ విషయం పై స్పందిచకుండా ఫామ్ హౌస్ లో నుండి బయటకు రాకుండా ఉన్నాడన్నారు. ఈ దుబ్బాక ఎన్నికల వైపు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రం లో వచ్చేది బిజెపి ప్రభుత్వం, అధికారులారా అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. జాగ్రత్తగా వ్యవహరించండని సూచించారు. ఎవరైనా ఫామ్ హౌస్ లో నుండి పాలన్ కొనసాగించే నాయకులు ఉన్నారా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: