రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువ అవుతుంది అన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో డబ్బులు దాచుకోవాలన్నా కూడా ప్రస్తుతం భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. సైబర్ నేరగాళ్ల పై అటు పోలీస్ అధికారులు నిఘా పెట్టి ఉక్కుపాదం మోపినప్పటికీ  ఎక్కడ సైబర్ నేరగాళ్ల బెడద మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల కారణంగా ఎంతోమంది ప్రజలు మోసపోతారు భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న  పైన ఎక్కువగా దృష్టి పెడుతున్న కేటుగాళ్లు.. అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసింది.



 ప్రస్తుతం రోజురోజుకు టెక్నాలిజీ  పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నో రకాల సేవలు ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ దారులకు అందుతున్నాయి. టెక్నాలజీ పుణ్యమా అని అటు ఆన్లైన్ మోసాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకే బ్యాంక్ అకౌంట్ దారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే ఉంటారు నిపుణులు. రోజురోజుకు సైబర్ నేరగాళ్ల కారణంగా మోసపోయి చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఎంతో మంది. ముఖ్యంగా మీ మొబైల్ నెంబర్ తో కూడా మీ అకౌంట్ నుంచి డబ్బు  కొల్లగొట్టే అవకాశం కూడా లేకపోలేదు.


 మొబైల్ ఫోన్లో నెట్ బ్యాంకింగ్ వాడే వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది నెట్ బ్యాంకింగ్ సర్వీసులను పొందుతున్నారు. ఇంట్లో కూర్చొని అన్నిరకాల సేవలు పొందుతున్నారు. కొంతమంది మొబైల్ నెంబర్ కు ఓటిపి ద్వారా ఈ సేవలు పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేసేందుకు అవకాశం ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కు ఎంతో మంది మోసగాళ్లు మొబైల్ పోయిందని లేదా సీమ్   విరిగిపోయింది అనేక కారణాలతో కొత్త సిమ్ కార్డు తీసుకొని.. మీ సెల్ఫోన్కు ఎలాంటి ఓటీపీ రాకుండా ఎంతో జాగ్రత్తగా మోసానికి పాల్పడతారు. తర్వాత  మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొల్లగొడతారు. వెంటనే అప్రమత్తం కాకపోతే జరగాల్సిన నష్టం  జరిగి  పోతుంది. అందుకే.. ఖాతాదారుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: