భారత సైన్యం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి దేనికైనా సిద్ధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా సరే భారతదేశం యొక్క సార్వభౌమత్వం ఇతర దేశాల దగ్గర తాకట్టు పెట్టేందుకు అసలు అంగీకరించరు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీల ఆర్మి పై ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ  ఎదురు సమాధానం చెప్పారూ  తప్ప ఎక్కడ శత్రు దేశాలకు తల వంచ లేదు. కానీ ఇదే పరిస్థితి అటు చైనాలో మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. అక్కడ దేశాన్ని ఆర్మీ ని నడిపించేది సైన్యం కాదు ఏకంగా ఒక పార్టీ.



 ఒక పార్టీ దేశంలో పాలన సాగించడమే కాదు ఏకంగా దేశానికి రక్షణ కల్పిస్తున్న ఆర్మీని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే చైనా లో ఉండే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పై భారత రక్షణ రంగ విశ్లేషకులు ప్రస్తుతం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సాధారణంగా ఒక దేశం యొక్క రక్షణ వ్యవస్థ అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా... దేశ రక్షణ కోసం పోరాడాలి అంతే తప్ప చైనాలో ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాత్రం దేశ రక్షణ కోసం కాదు ఏకంగా ఒక పార్టీ కోసం పోరాడుతుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రక్షణరంగ విశ్లేషకులు. పార్టీ చెబితే ప్రజల ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడని వాళ్లు దేశం యొక్క ఆర్మీ ఎలా అవుతుందని కేవలం కిరాయి మూకలు  మాత్రమే అవుతారు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రస్తుతం రక్షణ రంగ విశ్లేషకులు.



 చైనాలో ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కేవలం జిన్ పింగ్  పార్టీ చెప్పు చేతల్లోనే ఉంటుందని ఒకవేళ జిన్ పింగ్  చేసే దారుణాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాదని... ఇలా ఒక పార్టీ కింద బానిస గా ఉంటూ  ప్రజల ప్రాణాలు సైతం తీయడానికి వెనకాడని వారిని కిరాయి మూకలు  అంటారు తప్ప దేశం యొక్క ఆర్మీ అనరు అని ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లెక్కలు కూడా సరిగ్గా ఉండని ఈ నిస్సిగ్గు అమానవీయ గుంపు కి నాయకత్వం వహించేది పార్టీ మాత్రమే కాని దేశం కాదు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: