ఈరోజు గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా బిజెపి పార్టీ  తరపున  ప్రచారంలో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  షా హైదరాబాద్ కి విచ్చేశారు..ఆ తర్వాత సికింద్రాబాద్ లో జరిగిన రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు..అయితే అమిత్ షా ప్రచారానికి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు  అడుగడుగునా అడ్డు పడ్డారు.. అమిత్ షా గారి  రోడ్ షో సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి  నిరసనకు దిగారు..సేవ్ బిఎస్ఎన్ఎల్ అంటూ స్లొగన్స్ చేస్తూ వారందరు  నిరసన తెలిపారు..

సికింద్రాబాద్ దగ్గర్లో నివాసం ఉంటున్న కొందరు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఇలా  అమిత్  షా రోడ్ షో కి వస్తుండటం చూసి తమ ఇంట్లో నుండే  నిరసన వ్యక్తం చేసారు ..   కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలపై వివక్ష చూపిస్తోందని ప్రభుత్వ రంగ సంస్థలను అంతమొందించి ప్రైవేట్ సంస్థలను అభివృద్ధి చేసేలా  ప్రయత్నాలు చేస్తోందని పార్లమెంటులోను  పలు ఆరోపణలని ఎదురుకొంటుంది ..

ఈ నిరసనల మధ్య అమిత్ షా తన రోడ్ షో ని  తొందరగా ముగించుకోవాలి వచ్చారు.. ఈ రోడ్ షో కి భారీగా కార్యకర్తలు చేరడంతో జన సమూహం మధ్య అమిత్ షా గారి వాహనం ముందుకు కదలడానికి చాలా సమయం పట్టింది.. ఇందుమూలంగా అమిత్ షా రోడ్ షో ని తొందరగా ముగించుకుని  అటు నుంచి నేరుగా నాంపల్లి బీజేపీ కార్యాలయానికి వెళ్లి పోయారు..

ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో అమిత్ షా మాట్లాడారు తానే ఈ గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ సీటు గెలుస్తామని ఉద్దేశంతోనే ఇందులో పోటీ చేశామని అమీషా స్పష్టంచేసారు ..మా  బిజెపి అభ్యర్థి మేయర్ అవ్వడం ఖాయమని అమిత్ షా  ధీమా వ్యక్తం చేసారు ..హైదరాబాద్  నగర అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుందని మొన్న వచ్చిన వరదలకు కెసిఆర్ ఎక్కడికి వెళ్లారని అమిత్ షా  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..

బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రపంచంలోనే మెరుగైన ఐటీ హబ్ గా హైదరాబాద్ ని మారుస్తామని అమిత్ షా అన్నారు.. అలాగే ఎంఐఎం పార్టీ అండతోనే టిఆర్ఎస్ పార్టీ నడుస్తోందని విమర్శించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: