గత కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ ఫ్యాన్స్ మధ్య వివాదం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే . పాకిస్తాన్ సిరియా లాంటి దేశాల నుంచి వచ్చిన వారు మత  రాజ్య స్థాపన కోసం రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం పేరుతో  ఫ్రాన్స్  పౌరులపై దాడుల కు పాల్పడడం ప్రాణాలు తీసుకోవడం లాంటి ఘటనల పై ఉక్కుపాదం మోపిన ఫ్రాన్స్.. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజానికి  పాల్పడేవారిని ఎక్కడికక్కడ కాల్చి పారేయాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం ఆ తర్వాత పాకిస్తాన్  ఫ్రాన్స్ తీరు ను పూర్తిగా తప్పు పట్టడం జరిగింది.




 ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో ఉన్నటు వంటి ఫ్రాన్స్ దౌత్యపరమైన కార్యాలయాన్ని కూడా ఫ్రాన్స్ ముట్టడించడం మరింత సంచలనంగా మారి పోయింది. ఇక పాకిస్తాన్ తీరు పై తీవ్ర ఆగ్రహం తో ఉన్న ఫ్రాన్స్.. పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్. ఫ్రాన్స్ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన యుద్ధ విమానాల పై ప్రస్తుతం కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్. ప్రస్తుతం పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడంతో ఎలాంటి డబ్బులు చెల్లించక పోయిన ప్పటికీ మీరేజ్  యుద్ధ విమానాలను మరమ్మత్తులు చేస్తూ వస్తుంది ఫ్రాన్స్.



 అంతేకాదు ఉగ్రవాద బాధిత దేశాలకు ఇచ్చేటువంటి  సహాయం కూడా ఫ్రాన్స్ నుంచి పాకిస్తాన్ అందుకుంటుంది. ఇక ఇటీవలే మీరేజ్  యుద్ధవిమానాల పై కఠిన ఆంక్షలు విధించింది ఫ్రాన్స్.మిరేజ్  విమానాలకు సంబంధించిన మరమ్మతులు ఇక చేసేది లేదు అంటూ తేల్చి చెప్పింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు పై విమర్శలు చేస్తూ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. ఇక ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకునేది  లేదు అంటూ తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: