ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొత్తం ఫోకస్ అయన అనౌన్స్ చేసిన నాలుగు సినిమాలపై నే ఉంది.. పూర్తి స్థాయి రాజకీయాల్లో కి వచ్చానన్న పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ఫుల్ టైం సినిమాల్లోనే ఉంటున్నారు..కరోనా తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి తన సినిమా షూటింగ్ లు ప్రారంభించి అందులో బిజీ గా ఉన్నారు..  2014 లోనే పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ కు ఆ టైం లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రాలేదు.. దాంతో చంద్రబాబు కు మద్దతు ఇచ్చి టీడీపీ గెలుపులో కీలక పాత్ర వహించారు.. ఇక 2019 లో అవకాశం వచ్చిన సరైన బలం లేక కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నాడు.. దాంతో పవన్ జనసేన కథ మళ్ళీ మొదటికొచ్చింది.. దాంతో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్..

అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏమాత్రం కృంగిపోని పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కూడా బీజేపీ నేతలకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో రాసుకుని పూసుకుని తిరిగాడు. అయితే పొత్తు పెట్టుకుని సంవత్సరం కూడా కాలేదు ఈ రెండు పార్టీ లకు అసలు పొసగడం లేదట.. అందుకు కారణం రెండు పార్టీ లకు వేరువేరుగా విధి విధానాలు ఉండడమే అంటున్నారు.. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో రెండు పార్టీ లకు ఏమాత్రం ఒకే అభిప్రాయం కుదరట్లేదట. అయినా పవన్ కళ్యాణ్ గ్రేటర్ లో పోటీ చేయకుండా బీజేపీ కి మద్దతుగా నిలిచారు.

అయితే తొలిసారి బీజేపీ తో సంబంధం లేకుండా ఓ పనిచేయబోతున్నారు పవన్ కళ్యాణ్. నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం… రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. చాలా రోజుల తర్వాత రైతుల కోసం ప్రజల్లోకి వెళ్తున్నాయి. నివార్ తుపాను వల్ల పాడైన పంటలను పరిశీలించేందుకు కోస్తా, రాయలసీమలకు వెళ్తున్నారు. బుధవారం నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం గుంటూరు జిల్లాలో ఆ తర్వాత మూడు రోజుల పాటు అంటే.. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: