ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ దూసుకుపోతున్న సరే అవి క్షేత్ర స్థాయిలో అందడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ చాలా వరకు సీరియస్ గా ఉన్నా సరే మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ కీలక నేతలులు చాలా వరకు సీరియస్ గా లేకపోవడం సీఎం జగన్ కు ప్రధానంగా ఇబ్బందిగా మారింది. సంక్షేమ కార్యక్రమాలను ఎంతో దూకుడుగా అందిస్తున్న సరే వాటిని ప్రజలకు పూర్తి స్థాయిలో అందించ లేకపోవడం కారణంగా విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసే పరిస్థితి ఉంది.

శాసన సభలో ఇదే అంశానికి సంబంధించి ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. లబ్ధిదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్న కొంతమంది నేతల వ్యవహారంతో ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం జగన్ కాస్త సీరియస్ గా దృష్టి పెట్టారు. ఏంటి అనేది ఒకసారి చూస్తే లబ్ధిదారుల ఎంపిక విషయంలో పక్షపాతం అనేది ప్రదర్శిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే వారిని ఎంపిక చేస్తున్నారు.

దీనితో ఇప్పుడు అధికారుల విషయంలో అదేవిధంగా నేతల విషయంలో సీఎం జగన్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నారు. కొంతమందిని పదవుల నుంచి కూడా తప్పించి ఆలోచనలో ఆయన ఉన్నట్లు గా సమాచారం. ఇటీవల రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది మంత్రులు లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమ తమ జిల్లాలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఇతర పార్టీలకు చెందిన వారికి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. కాబట్టి సీఎం జగన్ వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సంక్షేమ కార్యక్రమాలలో వేలు పెడుతున్న మంత్రులను క్యాబినెట్ నుంచి కూడా అవసరమైన తప్పించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో ఒక అడుగు పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: