గ్రేటర్ లో ట్రెండ్ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ లో కాస్త ఎడ్జ్ ఉంటుందని తేలినా.. ఆ తర్వాత మాత్రం టీఆర్ఎస్ కు రిజల్ట్ పూర్తి అనుకూలంగా వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంతోషంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

గతంలో బీహార్ ఎన్నికల విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేశాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ లో కూడా అలాంటి అంచనాలే ఉంటాయని అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్ కు 90 సీట్లు కూడా రావేమోనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ నాయకులు మాత్రం 100 వచ్చే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.

కౌంటింగ్ మొదలయ్యే సమయానికే టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నాయి. ఫలితాలు వచ్చే సమయంలో నగరవ్యాప్తంగా భారీ ప్రదర్శన చేపట్టాలని ఈపాటికే ప్రణాళికలు రచించాయి. అటు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, రిజల్ట్ ఎలా వచ్చినా స్వీకరించాలని నేతలకు, కార్యకర్తలకు సూచించార. నూటికి నూరు శాతం.. టీఆర్ఎస్ కి నూరు సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు బీజేపీ శ్రేణులు కూడా కౌంటింగ్ ట్రెండ్ తమకే అనుకూలంగా ఉందని చెప్పడం విశేషం. అధికారం దక్కకపోయినా ఆశించిన స్థాయిలో స్థానాలు సాధిస్తామని ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అభ్యర్థులు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా తమకు గతంలో కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని తేలడంతో బీజేపీ కూడా సంబరాలకు సిద్ధమవుతోందట. ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడిన తర్వాత ఎవరెవరు పండగ చేసుకుంటారు, ఎవరెవరు మీడియాకు మొహం చాటేస్తారనే విషయం తేలుతుంది. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు మాత్రం పూర్తిగా డీలా పడినట్టు తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆ పార్టీ అభ్యర్థుల హడావిడి కూడా కనిపించడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: