తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అనే విషయం మరోసారి స్పష్టంగా అర్థమైంది. అయితే ఆ పార్టీ సాధించిన విజయం మాత్రం అనుకున్న విధంగా లేదు అనే భావన చాలా వరకు వ్యక్తమైంది. 2016 ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు గెలిచిన ఆ పార్టీ సత్తా చాటింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా పార్టీ స్థానాలు ఘోరంగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ బలపడటం అనే విషయం స్పష్టంగా అర్థమైంది. అయితే ఆ పార్టీ కొన్ని కొన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునే విషయంలో ఘోరంగా విఫలమైంది అనే భావన చాలా వరకు ఉంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రభావం ఆ పార్టీ మీద చాలా వరకు పడింది. కొన్ని ప్రాంతాల్లో వరద సహాయం ఆశించిన స్థాయిలో అందకపోవడం టిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. రాజకీయంగా కీలకమైన సమయంలో కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వాటాలు పంచుకున్న పరిస్థితిని చూశాం. కాబట్టి అది ప్రభావం చూపించి ఉండవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల ముందు చేయడంతో కూడా ప్రజల్లో ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరగదు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమయింది.

భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ దాదాపు రెండేళ్ల క్రితమే జాగ్రత్త పడవలసిన అవసరం అనేది ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్నాయి అనగా హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడింది. అందుకే టిఆర్ఎస్ పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేక పోయింది అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. మరి ఇక నుంచి ఎలా ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: