ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ విషయంలో ఇప్పుడు ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు ఆ పార్టీ ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కూడా ఘోరంగా వెనకడుగు వేస్తున్నారు అని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా అయిన తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది.

ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపించ లేదు అంటే మాత్రం ఆ పార్టీ పూర్తిగా కనుమరుగై పోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్... మరొకరికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మీడియా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం... జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు దళిత నేతను  పవన్ కళ్యాణ్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దళిత నేత విషయంలో ఇప్పటికే చర్చలు జరిగాయని ఆయన ఎవరో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయించారని అంటున్నారు. ఆయన కేవలం పార్టీ వ్యవహారాలు మాత్రమే చూసిన సరే పార్టీ అధ్యక్షుడిగా మరొకరిని నియమించి పార్టీని ముందుకు నడిపించాలని భావిస్తున్నారట. సదరు నేత రాష్ట్ర పర్యటనలు చేసి పార్టీ గురించి అన్ని విధాలుగా కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా... పార్టీ విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్... ప్రణాళిక సిద్ధం చేసే విధంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు మాత్రం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: