రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరాలంటే ఎన్నో కలవాలి. కేవలం ప్రజాభిమానం ఉంటే సరిపోదు. ఇది చాలా ఎన్నికలతో పాటు, చాలా మంది నాయకుల విషయాల్లో పార్టీల విషయాలలోనూ  పదే పదే రుజువు అవుతూ వచ్చిన సత్యం. ఎంతగా రాజకీయ పార్టీలు నాయకులు జనంలో ఉన్నా కూడా వారిని  జనం మెదళ్లలో పెట్టేది పదిలంగా ఉంచేది మాత్రం శక్తివంతమైన సాధనాలు మాత్రమే.

దానినే మీడియాగా చెప్పాలి. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడచించి కానీ ఏపీలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడంలో సర్కార్ అలసత్వం ప్రదర్శించడం పట్ల పాత్రికేయులలో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో పెద్దగా ఆంక్షలు లేకుండా అందరికీ అక్రిడేషన్లు మంజూరు అయ్యేవి. కానీ వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో కొత్త రూల్స్ ఫ్రేం చేసింది.

వాటిని కనుక అనుసరిస్తే మాత్రం పెద్దగా ఎవరికీ అక్రిడేషన్లు రావు. ఇక జిల్లాలలో నియమించే అక్రిడేషన్ కమిటీలలో పాత్రికేయ సంఘాలకు స్థానం లేకుండా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. దాని మీద జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనాపధంలో ఉన్నాయి.ఇక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీని మీద వైసీపీ సర్కార్ కి నోటీస్ పంపించి వివరణ అడిగేదాకా సీన్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఏపీలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వకుండా వేధించడం బాగులేదని పాత్రికేయ సంఘాలు అంటున్నాయి. తిప్పి తిప్పి కొడితే ఏపీలో ముప్పయి వేల మంది దాకా మాత్రమే జర్నలిస్టులు ఉంటారని, వారికి అక్రిడేషన్ల వల్ల ఒనగూడేది బస్ పాస్ మాత్రమేనని, ఇక ఇళ్ళ స్థలాల విషయానికి వస్తే అర్హత ఉన్న వారికే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు.

అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం తమకు పడని మీడియా మేనేజ్మెంట్లను దృష్టిలో పెట్టుకునే జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. దీని వల్ల నూటికి తొంబై శాతం పాత్రికేయులకు అన్యాయం జరుగుతుందని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన పాత్రికేయ లోకంతో పెట్టుకుంటే వైసీపీకి ఫ్యూచర్ లో పొలిటికల్ గా ఇబ్బంది వస్తుంది అని కూడా హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: