చంద్రబాబు తన నాయకుల కు బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపినట్లు ఉన్నాడు అందుకే తాను ఏం మాట్లాడితే అదే నాయకులు తిరిగి మాట్లాడుతూ ప్రజలకు విసుగుతో పాటు కోపాన్ని తెప్పిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివాదాస్పద అంశాల్లో ఒకటి స్థానిక ఎన్నికల విషయం..రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ముందు పెట్టి టీడీపీ ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు ఎప్పుడో గమనించారు. నిమ్మగడ్డ కేవలం పావు మాత్రమే.. ఈ విషయం అర్థం కాని నిమ్మగడ్డ టీడీపీ చెప్పిందల్లా చేస్తూ ప్రజల్లో బ్యాడ్ నేమ్ ను మూట కట్టుకుంటున్నాడు..

అయినా టీడీపీ పిచ్చి తనం కాకపోతే కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించిన ప్రజలు స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ తరపున ఎందుకు వస్తారన్నది వారికి ఎందుకు తెలీట్లేదో అర్థం కావట్లేదు.  ఏపీలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గతేడాది మార్చిలో తొలుత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నామినేషన్ల దాఖలు వరకూ ప్రక్రియ అంతా సాఫీగా సాగింది. నామినేషన్ల చివరి రోజు నాటికి కూడా చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్లు వేయ డానికి కూడా అభ్యర్థులు దొరకలేదు. సగం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీయే లేకుండా ఏకగ్రీవం అయ్యారు.

దీంతో తెలుగుదేశం నేతలకు బుర్ర పాడైంది. వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారంటూ రాద్దాంతం మొదలుపెట్టారు. ఇదిలా జరుగుతుండగానే.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే నిమ్మగడ్డ కరోనా సాకు చెప్పి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు. ఇదే పెద్ద కుట్ర అనుకుంటే ఇప్పుడు కరోనా విజృంభణ ఉన్న సమ యంలో ఎన్నికలు వద్దని కోర్టు కెళ్లిన జగన్ ప్రభుత్వానికి ఎన్నికలు అంటే భయం అని  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు తన పిచ్చి ని కొంత అచ్చెన్న కు కూడా ఎక్కించాడని ఈ దెబ్బతో తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: