ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో శ్రమించాయి. బ్రెజిల్‌లో తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. చైనా ప్రభుత్వరంగానికి చెందిన సినోవాక్‌ టీకా సామర్థ్యం కేవలం 50.4 శాతమేనని అక్కడి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బుటాంటన్‌‌ బమోమెడికల్‌ సెంటర్‌ నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. ఇదే సంస్థ గతంలో చైనా టీకా సామర్థ్యం ఏకంగా 70 శాతమని ప్రకటించింది. ట్రయల్స్‌కు సంబంధించిన ప్రాథమిక విశ్లేషణ అనంతరం ఈ ప్రకటన చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చైనాపై నమ్మకం పెంచుకున్నారు.

ఇక టీకా సామర్థ్యం గురించి బయటకు పొక్కడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలకు త్వరగా టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న బ్రెజిల్‌ ప్రభుత్వానికి ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది. తాజాఆ విడుదల చేసిన ఫలితాల్లో స్వల్ప తీవ్రత కలిగిన కరోనా కేసులపై జరిపిన విశ్లేషణ కూడా జోడించామని బుటాంటాన్‌ సంస్థలో క్లినికల్‌ విభాగం డైరెక్టర్ వెల్లడించారు. ఇలా విడతల వారీగా టీకా భద్రత, సామర్థ్యాలకు సంబంధించి సమాచారాన్ని విడుదల చేయడంపై బ్రెజిల్‌లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే చైనా టీకా ప్రయోగ పరీక్షలు, కొనుగోళ్లకు సంబంధించిన డీల్స్‌ను చాలా దేశాలు రద్దు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో సివోవాక్‌ టీకా ప్రయోగ పరీక్షలకు చైనా ముందుగా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రయోగ పరీక్షలకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని బంగ్లాదేశ్‌ భరించాలంటూ ఇరకాటంలో పెట్టేసింది. దీంతో ఈ ఒప్పందం బంగ్లాదేశ్‌ రద్దు చేసుకుంది. బ్రెజిల్‌ కూడా కొన్నాళ్లు ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిలిపివేసింది. అయితే కొత్తగా వెలువడిన డేటాతో బ్రెజిల్‌లో టీకా కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బుటాంటన్‌ను ప్రభుత్వ వర్గాలు అదనపు డేటాను సమర్పించాలని ఆదేశించాయి. ఇప్పటి వరకు బ్రెజిల్‌ కేవలం చైనా టీకాతో పాటు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాపై ఆధారపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: