తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న విమర్శల విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. బండి సంజయ్ పదేపదే సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా బండి సంజయ్ విషయంలో దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బిజెపి విషయంలో సీఎం కేసీఆర్ అనుకున్న విధంగా స్పందించలేకపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలను బండి సంజయ్ పదేపదే చేస్తూ వస్తున్నారు.

అయినా సరే సీఎం కేసీఆర్ మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళేముందు సీఎం కేసీఆర్ పదేపదే బీజేపీ మీద విసిరినా విసుర్లు కూడా మనం చూశాం. కానీ ఇప్పుడు సీఎం సైలెంట్ గా ఉండడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో  కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. త్వరలోనే సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో సఖ్యత కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

అయితే ఎప్పుడు వెళ్తారు ఏంటనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సీఎంతో పాటు ఇద్దరు ఎంపీలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. శివసేన పార్టీ ఎన్డియేలో లేని లోటుని ఈ విధంగా భర్తీ చేసుకునే ఆలోచనలో బిజెపి ఉందని అంటున్నారు. మరి సీఎం కేసీఆర్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ లో జాయిన్ అవుతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: