తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జనవరి నుంచి ఇది మరీ ఎక్కువైంది. కేటీఆర్ పట్టాభిషేకానికి కొందరు గులాబీ నేతలు ముహుర్తం కూడా పెట్టేశారు. మార్చి లోపు అంటే దాదాపుగా ఫిబ్రవరిలో కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం కావడం ఖాయమని చెబుతున్నారు. ఇందుకు బలాన్నిచ్చేలా తాజాగా మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారు.కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.

          త్వరలోనే రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారని ఖమ్మం జిల్లా  వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ అన్నారు.  కారేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్పార్టీ ఆఫీస్ను  ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రతిపక్షం లేదని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్నాయకుల్లోనే స్వల్ప విబేధాలున్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటుచేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. వచ్చే  శాసనసభ  సమావేశాల్లో సీఎంగా కేటీఆర్ఉండాలన్నది తన అభిప్రాయమని  బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు.  నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన షకీల్..  కేసీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.గతంలోనూ కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కామెంట్ చేశారు బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే.
 
                టీఆర్ఎస్ నేతల ప్రకటనలకు అనుగుణంగానే ప్రభుత్వంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన అందులో భాగంగానే జరిగిందంటున్నారు. మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసే పంప్ హౌజులను పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. దాంతో పాటు యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణాన్ని పూర్తి చేసి.. ఆలయాన్ని ప్రారంభించాకా.. చండీయాగం, రాజశ్యామల యాగం మరోసారి చేసి... విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: