కరోనా కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అక్కడి జర్నలిస్టులను ఆదుకుంది. అందరి సమస్యలను గుర్తించి ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టుల ఇబ్బందులను తెలుసుకొని వారికి ఆర్థిక సాయం అందించింది తెలంగాణ రాష్ట్ర మీడియా. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా, రైతన్నకు కష్టం వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులకు ఒడిదుడుకులు ఎదురైనా, డాక్టర్లు, యాక్టర్లు, డ్రైవర్లు ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినా వాటిని వెలుగులోకి తీసుకువచ్చి... ఆ వార్తలను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకొని వెళ్లి వారి సమస్యలు తీరడానికి సహాయపడుతున్నారు జర్నలిస్టులు. మరి అలాంటి జర్నలిస్టుల కే కష్టం వస్తే చూసేది ఎవరు..?? తీర్చేదెవరు...??

ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో... డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు పోలీసులతో సమానంగా జర్నలిస్టులు కూడా కరోనా మరింత విజృంభించకుండా ఉండటానికి సహాయ పడ్డారు. కరోనాకు సంబంధించిన అన్ని వార్తలను... ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తూ వారిని పరోక్షంగా రక్షించడంలో భాగమయ్యారు జర్నలిస్టులు. అలా కరోనా వారియర్స్ లో భాగమైన వీరిలో ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. కొందరు తమ ప్రాణాలను సైతం విడిచారు. అలాంటివారికి కొంతైనా సాయం అందించాలని ముందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్ర మీడియా.

కరోనా విపత్తు సాయం అన్నీ కలిపి ఇప్పటి వరకు జర్నలిస్టుల కుటుంబాలకు 9 కోట్ల 50 లక్షల రూపాయలను ఖర్చు చేశామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి కరోనా బారిన పడి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కుటుంబాలకు 3 కోట్ల 56 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలబడ్డామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు భరోసా ఇచ్చి  ఆర్థిక భారం తగ్గించిందని ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భంగా ఆయన తెలియచేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: