ఇటీవల నగరాల్లో డ్రగ్స్ మరియు వ్యభిచారం కేసులు జోరుగా కొనసాగిన సంగతి తెలిసిందే.. ఇలాంటి ఘటనల పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.. దాంతో కేసులు చాలా వరకు తగ్గాయి.. ఇప్పుడేమో ఏకంగా ఆన్ లైన్ మోసాలు వెలుగు చూస్తున్నాయి.. ఆన్ లైన్ ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం తో పాటుగా వారి పై దారుణమైన దోపిడీలను కూడా చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో సునీల్ ఆత్మ హత్య కలకలం రేపింది. ఆన్ లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న అతను తిరిగి చెల్లించలేదని యాప్ వాళ్ళు అతన్ని మానసికంగా హింసించారు.  దాంతో అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు..అతని తల్లి దండ్రుల ఫిర్యాదు ల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నో ట్విస్ట్ జరిగాయి. రుణ యాప్ లను తొలగించడంతో పాటుగా కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..



ఈ కేసు విచారణ లో రోజుకో నిజం బయట పడుతుంది. చాలా మంది ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక మరణించారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామంలో 15 రోజుల క్రితం వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. బాధితు కుటుంబ సభ్యుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. 



రుణ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలకు రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. రుణ యాప్‌ కాల్‌సెంటర్ల వేధింపులతో చాలా చోట్ల రుణ గ్రహీతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రుణ యాప్‌లను 90 శాతం చైనా వారే నడుపుతున్నట్లు తెలుస్తున్నది. రుణ యాప్ ల ద్వారా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే 100కు డయల్‌ చేసి వివరాలు అందజేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకానీ చనిపోవాలని మాత్రం చూడొద్దని పోలీసులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: