ఏపీలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంచి క్రేజ్ తెచ్చుకున్న నాయకులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో పనిచేస్తూ, ప్రజలకు చేరువయ్యి, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యే విడదల రజిని ఒకరు. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని మొదట టీడీపీలో చేరారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో పార్టీలో బాగానే యాక్టివ్‌గా పనిచేశారు. అలాగే టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు సపోర్ట్‌గా నిలబడ్డారు.

నియోజకవర్గంలో పార్టీ తరుపున బాగానే పనిచేశారు. కానీ 2019 ఎన్నికల ముందు మాత్రం రజిని ప్లేటు తిప్పేశారు. ప్రత్తిపాటిని ఎలాగైనా ఓడించాలనే కసితో వైసీపీలోకి జంప్ కొట్టారు. ఇక రజిని కోసం జగన్, సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని సైతం పక్కనబెట్టేశారు. రాజశేఖర్‌కు అధికారంలోకి వచ్చాక పదవి ఇస్తామని చెప్పి సర్ది చెప్పి, సైడ్ చేశారు. దీంతో రజిని చిలకలూరిపేట బరిలో ప్రత్తిపాటిపై పోటీ చేశారు. అయితే పేటలో ప్రత్తిపాటిని ఓడించడం సాధ్యం కాదని అంతా అనుకున్నారు.

కానీ రజిని తక్కువ రోజుల్లోనే జనాల్లోకి వెళ్ళిపోయారు. పైగా జగన్ వేవ్ బాగా ఉంది. దీంతో పేటలో రజిని, ప్రత్తిపాటిని చిత్తు చేశారు. ఆయనపై సూపర్ విక్టరీ కొట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని, పేటలో దూసుకెళుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో సైతం రజిని క్రేజ్ పెరిగింది. రాష్ట్ర స్థాయిలో రజినికి ఫాలోయింగ్ పెరిగింది. అసలు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో రజినికి పదవి దక్కడం ఖాయమనే రేంజ్‌కు వెళ్లారు.

ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న రజినికి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పేట సీటు ఖాయమని తెలుస్తోంది. సీనియర్ నేత మర్రికి మళ్ళీ సీటు రాకపోవచ్చని తెలుస్తోంది. పేట వైసీపీ సీటులో మళ్ళీ రజిని పోటీ చేసి, మళ్ళీ ప్రత్తిపాటిని ఓడించడం ఫిక్స్ అని, ఆమె అనుచరులు హడావిడి చేసేస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రజిని పరిస్తితి ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: