ఏపీలో పంచాయితీ ఎన్నికల పోరు బాగా హాట్ హాట్‌గా సాగేలా కనిపిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ పంచాయితీ పోరులో హోరాహోరీగా తలపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ స్థానిక పోరు ఏకపక్షంగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ స్పష్టంగా ఉంది. దీంతో ప్రజలు ఫ్యాన్ వైపుకు వెళ్లారు.

కానీ ఇప్పుడు ఆ వేవ్ కొంతవరకు తగ్గిందనే చెప్పొచ్చు. మరీ జగన్‌పై వ్యతిరేకిత రాకపోయినా, టీడీపీకి కాస్త అనుకూలంగా పరిస్తితి ఉంది. టీడీపీ నిత్యం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంది. అటు జగన్ సైతం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి, మిగతా విషయాలని గాలికొదిలేశారు. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కొంతమంది ప్రజలు వైసీపీ పాలన పట్ల సంతృప్తిగా లేరు.

ఇక ఈ ప్రభావం పంచాయితీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించేలా ఉంది. ఇదే టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా కనిపిస్తోంది. కాకపోతే పవన్ కల్యాణ్, చంద్రబాబు కొంప ముంచేలా ఉన్నారు. 2019 ఎన్నికల్లోనే జనసేన పోటీలో ఉండటం వల్ల, బాబుకే ఎక్కువ డ్యామేజ్ జరిగి, ఓట్లు చీలిపోయి చాలా నియోజకవర్గాల్లో టీడీపీ తక్కువ మెజారిటీలతో ఓడిపోగా, వైసీపీ విజయం సాధించింది.

అయితే ఇప్పుడు బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా వీరు ఎంతో కొంత ఓట్లు చీల్చుకునే అవకాశం ఉంది. అది కూడా టీడీపీకి పెద్దగా బొక్క పడేలా ఉంది. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే, చివరికి వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్లైతే పంచాయితీ ఎన్నికల్లో పవన్ వల్ల బాబుకే ఎక్కువ డ్యామేజ్ జరిగేలా ఉంది. అలాగే జగన్‌కు బాగా బెన్‌ఫిట్ కానుందని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ వల్ల పంచాయితీ పోరు ఎలా మారుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: