టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేయాలని.. గెలుపు ఓటములతో సంబంధం లేదని చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడికి ఏం చేయాలి దిక్కు తోచడం లేదు. టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాస్తవం ఏమిటంటే.. కేశినేని నాని టీడీపీ పార్టీని ఎట్టి పరిస్థితులలోనూ వదిలే ప్రసక్తే లేదు. అలాగని టీడీపీ పార్టీలో సర్దుకు పోయే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆయన పార్టీలో కుంపటిలా తయారయ్యారు.
 
 
 'నేను గెలిచిన నాయకుడిని.. ఓడిపోయిన వారి మాట వినాలా. ఓడిపోయిన నేతలు నాపై పెత్తనం చేయాలనుకుంటే అది కుదరదు అని కేశినేని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానంలో పెను దుమారాన్నే రేపాయి. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ కేశినేని నాని తో సర్దుకుపోలేనంతగా విభేదాలు ఏమీ లేవని చెప్పి.. తనకు ఆయనకు మధ్య అన్ని వివాదాలు సద్దుమణిగాయి అని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు.
 
 
 గత కొద్ది రోజులుగా బుద్దా వెంకన్న కి, కేసినేని నాని కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఐతే నాని కి ఎదురు చెప్పే ధైర్యం చంద్రబాబు కి లేకపోవడంతో ఆయన రంగంలోకి దిగి కేవలం వెంకన్న కు మాత్రమే సర్దిచెప్పారు. అందువల్ల వెంకన్న నాని జోలికి వెళ్లడం లేదు. దీంతో కేసినేని నాని కూడా చల్లబడ్డారని.. టీడీపీ పార్టీలోని అంతర్గత కల్లోలానికి తెర పడిందని తెలుస్తోంది. అయితే ఈ విషయం టీడీపీ కార్యకర్తలకు తెలియడంతో.. సొంత పార్టీలోనే గొడవలు అవుతున్నాయి కాబట్టే టీడీపీ పార్టీ ఓడిపోతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: