ప్రస్తుత మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడుతున్న చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో ఎవరూ కూడా మనుషుల ముఖాలను చూసి మాట్లాడటం లేదు చేతిలో మొబైల్ చూస్తు ఎదురుగా ఉన్న మనుషులతో మాట్లాడుతున్నారు. మొబైల్ మనుషులను అంతలా  బానిసలుగా మార్చుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వివిధ రకాలుగా ఉపయోగపడెందుకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఎన్నో యాప్స్ ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు  అందరినీ ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. అయితే కొన్ని రకాల మొబైల్ యాప్స్ ఉపయోగించడానికి ఎక్కువగా మొబైల్ డాటా కావాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే కొంతమంది చాలా తక్కువ సమయం మాత్రమే ఆ యాప్ వినియోగించి ఆ తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల యాప్స్ మాత్రం క్లోజ్ చేసిన తర్వాత కూడా మొబైల్ డాటా వినియోగిస్తూ ఉంటాయి. ఇలా వాడకపోయినప్పటికీ మొబైల్ డాటా అయిపోతూ ఉంటుంది.




 మొబైల్ లో యాప్స్ యాక్టివ్ గా లేకపోయినప్పటికీ డేటా  వాడుతూ ఉండటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇలా డేటా  నష్ట పోకుండా ఉండేందుకు... మొబైల్ లో ఒక సెట్టింగ్ చేస్తే సరిపోతుంది అని అంటున్నారు టెక్  నిపుణులు. మొబైల్ లో సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్లి డేటా నెట్వర్క్ ఆప్షన్ ఎంపిక చేసుకుని డేటా  యూసేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో అవసరం లేని  యాప్ కి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ డేటా  యూసేజ్ ఆప్షన్ను ఆఫ్ చేసుకోవాలి. అలాగే అన్ రిస్ట్రీక్టెడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. మొబైల్ డాటా లేదా వైఫై అనే రెండు ఆప్షన్లతో ఒక దానిని ఎంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇక మొబైల్ యాప్స్ యాక్టివ్గా లేని సమయంలో డాటా సేవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: