తెలంగాణలో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ నిన్న జరిగింది. ఇక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఉప ఎన్నిక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ఈ క్రమంలోనే ఇక నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది.  అయితే ఎంతో మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



 కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య తగిన జాగ్రత్తలు మధ్య అధికారులు పోలింగ్ నిర్వహించారు అన్న విషయం తెలిసిందే.  ఇక పోతే ఇక గత కొన్ని రోజుల నుంచి అన్ని పార్టీల కీలక నేతలు అందరూ కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక ప్రచార రంగంలో దూసుకుపోయారు. ఈ క్రమంలోనే వివిధ హామీలతో కూడా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారూ.  అన్ని పార్టీలు కూడా ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని చెప్పాలి. అయితే ఇక అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరు సాగర్ లో ఓటర్లను ఎంతలా ఆకట్టుకున్నారు అన్నది  మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని నిన్న తేల్చారు సాగర్ ఓటర్లు.



 అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎంతో ప్రశాంతంగా ముగిసింది అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నికల్లో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నమోదు కాగా 88 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం లను నల్గొండలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి శశాంక్ గోయల్. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని అంతట పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: