జ‌న‌సేన‌లో గ‌తానికి భిన్నంగా క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టికే చాలా మంది కీల‌క నేత‌లు పార్టీని వీడి బ‌య‌ట‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో వారు .. పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌లేదు. కేవ‌లం త‌మ‌కు ఉన్న స‌మ‌స్య‌ను మాత్ర‌మే చెప్పారు. తాము ఇమ‌డ‌లేక పోతున్నామ‌ని .. చెప్పిన వారు కొంద‌రు ఉన్నారు. మ‌రికొంద‌రు .. ప‌వ‌న్ ద్వంద్వ వైఖ‌రి న‌చ్చ‌కే..తాము పార్టీకి దూర‌మ‌వుతున్నామ‌ని.. చెప్పిన వారు ఉన్నారు. కానీ, ఇప్పుడు దీనికి భిన్నంగా.. పార్టీలోనే అంత‌ర్గ‌త కుమ్ములాట చోటు చేసుకుంది. కీల‌క నేత‌లు.. పార్టీలో ఉంటూనే.. ఒక నేత‌ను మార్చాల‌ని డిమాండ్ చేస్తున్న విష‌యం వెలుగు చూసింది. దీనిపై ఇప్ప‌టికే ప‌వ‌న్‌కు వివిధ రూపాల్లో ఫిర్యాదులు కూడా అందాయ‌ని తెలుస్తోంది.

ఆయ‌నే.. జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ఇటీవ‌ల కాలంలో మ‌నోహ‌ర్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కీల‌క నేత‌ల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని.. కొంద‌రు నేత‌లు మీడియాకు లీకులు ఇస్తున్నారు. అయితే.. ప్ర‌ధాన మీడియా వీటిని క‌వ‌ర్ చేయ‌డం లేదు. కానీ.. ఈ లీకుల ప‌రంపర మాత్రం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రింత దూకుడుగా ఏకంగా.. ప‌వ‌న్‌కే ఫిర్యాదులు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. మ‌నోహ‌ర్ వైఖ‌రి బాగోలేద‌ని.. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నారో.. ఆ పార్టీకి కాకుండా.. మ‌రో పార్టికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు యువ నాయ‌కులు. అంతేకాదు.. త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు.

కొన్నాళ్ల కింద‌ట కూడా మ‌నోహ‌ర్ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌వ‌న్ ఎక్క‌డ ప‌ర్య‌ట‌న ఏర్పాటు చేసినా.. దానికి సంబంధించి రోడ్ మ్యాప్ రెడీ చేసేందుకు ఒక టీం ఉంది. అదేస‌మ‌యంలో రాజ‌కీయ వ్య‌వ‌హారాల కింద‌.. సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చేందుకు నాదెండ్ల ఉన్నారు.కానీ, అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ నాదెండ్ల జోక్యం పెరిగిపోయింద‌ని.. దీనివ‌ల్ల ఆయా టీంలు ప‌నిచేసే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న వెలుగు చూసింది. అంతేకాదు.. మీడియా ముందుకు వ‌చ్చి.. పార్టీ ప‌రంగా వాయిస్ వినిపించాల‌న్నా కూడా నాదెండ్ల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అయింద‌ని.. దీంతో ఏం మాట్లాడాలో కూడా ఆయ‌నే డిసైడ్ చేస్తున్నార‌ని.. సీమ జిల్లాల‌కు చెందిన కొంద‌రు నేతలు బాహాటంగానే విమ‌ర్శించారు.

ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు గా ఉన్న త‌మ‌కు పార్టీ లైన్ తెలియ‌దా ? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాదెండ్ల‌ను మార్చాల‌ని.. డిమాండ్లు చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలోనూ ఈ విష‌యాన్ని ప‌వ‌న్ దృష్టికి అంత‌ర్గ‌తంగా తీసుకువెళ్లార‌ని తెలిసింది. దీంతో తాజాగా చేప‌ట్టి విద్యార్థులు ఉద్య‌మానికి సంబంధించి.. నాదెండ్ల కొంత సైలెంట్ అయ్యార‌ని తెలుస్తోంది. అందుకే విద్యార్థి సంఘాల‌కు మ‌ద్ద‌తుల‌గా నిరుద్యోగ స‌మ‌స్య‌పై గ‌ళం వినిపించేందుకు అవ‌కాశం చిక్కింద‌ని కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. నాదెండ్ల‌కు వ్యూహం లేన‌ప్పుడు.. ఆయ‌న త‌ప్పుకోవ‌డ‌మే మంచిద‌ని జ‌న‌సేన‌లోనే కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీలో కాపు వ‌ర్గం నేత‌లు,  యువ‌కులు కూడా నాదెండ్ల‌పై గ‌రంగ‌రం లాడుతున్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: