కొవిడ్ మహమ్మారి కట్టడికి పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లను ప్రజలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మన దేశంలో టీకాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మన దేశంలో హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేయగా, అది పలు దేశాలకు సప్లై అవుతోంది. ఈ క్రమంలోనే బ్రెజిల్‌కు వ్యాక్సిన్లను సరఫరా చేయాలన్న ఒప్పందం గతంలో జరిగింది. అయితే ఆ అవగాహనా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు బ్రెజిల్ కంపెనీ ప్రకటన చేసింది. అయితే, భారత్ బయోటెక్-బ్రెజిల్ కంపెనీతో జరిగిన 324 మిలియన్ డాలర్ల అగ్రిమెంట్‌లో అవతవకలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నియమ, నిబంధనలు ఉల్లంఘించారనే వాదనలు వినిపించారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారోపై పలు అవినీతి ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో రాజకీయ దుమారం రేగింది.

బ్రెజిల్‌లో నిరసనకారులు అధ్యక్షుడు బోల్సోనారోకు వ్యతిరేకంగా నినదించారు. ఈ క్రమంలోనే బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ దర్యాప్తు చేపట్టారు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ప్రెసిసా అనే సంస్థను మధ్యవర్తిగా ఉంచి కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడం ద్వారా బ్రెజిల్ అధ్యక్షుడు తన సన్నిహితుల్లో కొందరికి లబ్ధి చేకూర్చారని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఆ దేశానికి కావాల్సిన రెండు కోట్ల టీకాలకు ఆర్డర్‌ ఇస్తే వాటి డెలివరీ డిలే అయింది. అది కూడా బొల్సొనారోను ఇరకాటంలో పడేసింది. కాగా, వ్యాక్సిన్ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. ఇక వరుస ఆరోపణలు, దర్యాప్తులో భాగంగా మరింత లోతైన విశ్లేషణ కోసమే డీల్‌ను నిలిపేసినట్లు ఆరోగ్య శాఖ తెలుపుతోంది. కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంలో ఎలాంటి కుంభకోణం లేదని, జరగలేదని, అందులో తన రోల్ అస్సలు ఏం లేదని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో చెప్తున్నారు. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రతీ దేశంలో మస్ట్. కాగా, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిన నేపథ్యంలో త్వరలో మరో అగ్రిమెంట్ జరిగే అవకాశముంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: