బీజేపీ ఆలోచించి ఆలోచించి మరీ రాంగ్ స్టెప్ వేసిందా అన్నదే చర్చగా ఉంది. బీజేపీ తనది కాని రాజకీయాన్ని చేసింది అని కూడా అంటున్నారు. ఒకనాడు కాంగ్రెస్ ని ఇదే విషయంలో విమర్శించిన బీజేపీ ఇపుడు తానూ అదే పని చేయడం వల్ల కాంగ్రెస్ మాదిరిగానే మారుతోందా అన్నది కూడా చర్చగానే ఉంది మరి.

విషయానికి వస్తే బీజేపీ కర్నాటకంలో సుఖాంతం లేదు అనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ యడ్యూరప్పను ఎందుకు తప్పించింది, మళ్ళీ ఆయన నమ్మిన బంటు బొమ్మైని ఎందుకు కొత్త సీఎం గా నిలబెట్టింది అన్నది ఎవరికీ అంతుబట్టని విషయమే. ఈ మాత్రం మార్పునకు యడ్డీని ఎందుకు కదపాలని కూడా అన్న వారూ ఉన్నారు. యడ్యూరప్ప ఫేస్ వాల్యూతోనే కర్నాటకలో బీజేపీ గెలుస్తూ వచ్చింది. బీజేపీ దశను రెండు దశాబ్దాల క్రితం తిప్పిన వారిలో యడ్యూరప్ప ముందుంటారు.

ఆయన సామాజికవర్గం లింగాయత్ లకు యడ్డీ అంటేనే ఇష్టం. ఆయన్ని కాదని అదే సామాజికవర్గానికి చెందిన వారిని ఎవరిని పెట్టినా కూడా అక్కడ సీన్ వేరేలాగానే ఉంటుంది. దీంతో బీజేపీ ఎందుకు యడ్డీని కాదనుకుంది అన్న చర్చ వస్తోంది. యడ్యూరప్పను పక్కన పెట్టి తమ వర్గానికి అవకాశం ఇస్తారని ఆయన్ని వ్యతిరేకించిన వారు గట్టిగా కోరుకున్నారు. కానీ బీజేపీ చేసిన ఆపరేషన్ వారికి అసలు మింగుడుపడడంలేదు. ఈ మాత్రం సౌభాగ్యానికి ఎందుకు మార్పులు చేయడమని కూడా అంటున్నారు.

ఇక ప్రజలలో కూడా బీజేపీ కొత్త ముఖ్యమంత్రి మీద ఏ  విధమైన సానుకూలతా లేదు. ఆయన ఎవరికీ తెలిసిన వారు కూడా కాదు. ఆయనకు సీఎం పదవి దక్కింది యడ్యూరప్ప ఆశీస్సులతో, దాంతో ఆయనను ప్రసన్నం చేసుకుంటారు తప్ప పాలన సంగతి తరువాత  చూస్తారని  కూడా సెటైర్లు పడుతున్నాయి. బీజేపీ ప్లస్ యడ్యూరప్ప అంటే కర్నాటకలో స్ట్రాంగ్ అన్నది విపక్షాలకు కూడా తెలుసు. ఇపుడు యడ్డీని మైనస్ చేసుకుని చేజేతులా బీజేపీ విపక్షలకు చాన్స్ ఇచ్చేసింది అని కూడా అంటున్నారు. సౌత్ లో వచ్చే ఎన్నికలలో జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో కమలం ఆపరేషన్ సక్సెస్ కాలేదు అనే సొంత పార్టీలో వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి:

bjp