రాజకీయాల్లో  రెండు రెళ్ళు ఎప్పుడు కూడా నాలుగు అవుతుందనుకోవడం మన భ్రమే. రాజకీయాల్లో ఇది ఎప్పుడు  కుదరదు. దాని లెక్కలు వేరుగా ఉంటాయి. అయిన వారిని ఎప్పుడు దూరం చేసుకోరు.. ఒకవేళ వారు తిట్టుకున్నారు అంటే  సాయంత్రం వారు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నట్లే స్పష్టత. ఇంత లోతైనదే రాజకీయం. ప్రచారం అనేది ప్రజల నాలుకల మీద రకరకాల విన్యాసాలు చేయాలి. అలా చేయడంలో కెసిఆర్ చాణిక్యుడు అని చెప్పవచ్చు. అదే ఆయన విజయానికి సోపానంగా మారుతోంది. ఆయన లెక్కలు మరి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిల్లో ఉంటాయి.

అర్థం అవుతున్నట్లు అవతలివారికి అనిపిస్తుంది, కానీ దానిని పసిగట్టే అంత శక్తి వారికి ఉండదు, ఇలా ప్లాన్లు వేయడంలో  కెసిఆర్ ను మించిన వారు  ఎవరూ లేరని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమం పుణ్యమాని రాజకీయలన్నింటిని కెసిఆర్ రంగరించి మింగేశారు. ఆయనను అందుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో  ఎవరి తరం కాదని చెప్పవచ్చు. అందుకే ఆయన ఏది చెప్పినా కుండబద్దలు కొట్టినట్లు చెప్తారు. దీంతో అంతిమంగా తెలంగాణ  వచ్చేట్టు చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, అన్ని రాజకీయ విన్యాసాలు చూసి, అనుభవించిన కేసీఆర్ ఆయన పదునైన వ్యూహాలు అందుకోవడం ఎవరి వల్ల కాదు. ఆయనను రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా లాభం లేదని చెప్పవచ్చు. ఈ ఆలోచనతోనే  హుజురాబాద్ తెరాస టికెట్ కౌశిక్ రెడ్డికి ప్రకటించడం ఖాయం. రాజకీయంగా పనికి వస్తాడనుకున్న వారిని కెసిఆర్ ఎప్పుడూ వదులుకోడు. అందుకే ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా  హుజురాబాద్ ఎన్నికలు ఎందుకు వచ్చాయో మనందరికీ తెలుసు. ఒక మంత్రి అయి ఉండి  అసైన్డ్ భూములు కొనుగోలు చేయవద్దని తెలిసి కూడా కొనుగోలు చేశాడని ఆరోపణ ఈటెల పై పడింది. దీంతో ఆయన పార్టీ నుంచి భర్తరఫ్ అయ్యారు. రాజీనామా కూడా చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక  ఖరారయింది. ఈ సమయంలోనే  హుజురాబాద్ లో  జరిగే ఎన్నికల్లో  ఇతన్ని ఎలాగైనా ఓడించాలనే  పద్మ వ్యూహంతో  కెసిఆర్ పావులు కదుపుతున్నారు. అదే దీటుగా  ఈటెల కూడా విజయ సాధన కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి  పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు. కెసిఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు.

కానీ ఇప్పటివరకు  కెసిఆర్ టిఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది కన్ఫామ్ చేయలేదు. కానీ ఎక్కువగా కౌశిక్ రెడ్డికి ఇస్తేనే బాగుంటుందనే ఆలోచన పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే హుజురాబాద్ లో  కౌశిక్ రెడ్డి  ఇప్పటికే ఈటల రాజేందర్ మీద పోటీ చేసి  రెండుసార్లు  గట్టి పోటీ ఇచ్చి మరీ ఓడిపోయారు. దీంతో  కౌశిక్ రెడ్డికి ప్రజల్లో ఎక్కువగా సానుభూతి పెరిగిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున కౌశిక్ రెడ్డి నిలబెడితే సానుభూతితో పాటు, తెరాస పార్టీ గౌరవం మీద  ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదని  కౌశిక్ రెడ్డి కె హుజురాబాద్ టికెట్ ఇవ్వడానికి కెసిఆర్ మొగ్గు చూపుతున్నట్లు వాదనలు బలంగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: