ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ దాదాపు సంకేతాలు ఇచ్చేశారు. నిజానికి జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్తార‌నే ప్ర‌చారం కొన్ని రోజులుగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడే ఎందుకు వెళ్తార‌ని.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కూడా పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో జ‌గ‌న్ పాల‌న‌కు ప్ర‌జ‌లు ఏమేర‌కు మార్కులు వేస్తున్నారు?  ప్ర‌తిప‌క్షాలు ముఖ్యంగా ప్ర‌ధాన ప‌క్షం.. టీడీపీ చేస్తున్నట్టు.. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకత పెరిగిపోయింద‌నే ప్ర‌చారం జోరందుకుంది.

అదేస‌మయంలో కేంద్రం కూడా రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. కేంద్రం ముందు జ‌గ‌న్ చేతులు క‌ట్టుకుంటున్నార‌ని.. కూడా టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో.. త‌న‌ను తాను నిరూపించుకునేందుకు, త‌న పాల‌న విష‌యంలో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు.?  నిజంగానే త‌న పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందా? అనే విష‌యాలు.. జ‌గ‌న్‌ను ఆలోచ‌న‌కు గురి చేస్తున్న విష‌యం వాస్త‌వం. ఈ నేప‌థ్యంలోనే వ్యూహాత్మ‌కంగా ఆయ‌న ముంద‌స్తుకు తెర‌దీశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి అటు ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డంతోపాటు.. త‌న పాల‌న‌పై.. రాజ‌కీయంగా ప్ర‌జ‌లు ఎలా ఆలోచిస్తున్నార‌నే విష‌యాల‌ను ఆయ‌న తేల్చుకునే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

రాజ‌కీయంగా చూసుకుంటే.. ఇటు వైసీపీ నాయ‌కుల‌ను కూడా జ‌గ‌న్ క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఎవరికి వారు.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇంకా ఎన్నిక‌లు లేవు క‌దా.. అనే ధోర‌ణిలో ఎవ‌రి ఇష్టాను సారం వారు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీరిని అదుపు చేయాలంటే.. కూడా ముంద‌స్తు.. ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ద్వారా .. పార్టీని సుస్థిర ప‌రుచుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు చూడాలి. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా కొన్ని అంశాలు .. ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారిన విష‌యం వాస్త‌వం.

ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. వంటివి.. కూడా ఆయ‌న‌కు ఇబ్బందిగా మారాయి. ఈ క్ర‌మంలో.. దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. జ‌గ‌న్‌ను దోషిగా చూపిస్తోంది. అయితే.. వీటికి .. గ‌త ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని.. జ‌గ‌న్ స‌ర్కారు చెబుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఎలా ఆలోచిస్తున్నారు? అనే విష‌యాన్ని కూడా తేల్చుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఏర్ప‌డింది. మేమే అధికారంలోకి వ‌స్తామ‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న బీజేపీకి చెక్ పెట్టాలంటే కూడా .. ఇప్పుడు ముంద‌స్తుకు వెళ్ల‌డం ద్వారా.. త‌న స‌త్తా నిరూపించుకునే అవ‌కాశం తోపాటు.. ప్ర‌తిప‌క్షాల‌కు చెక్ పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: