ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే టిఆర్ఎస్ పార్టీలో... కొంతమంది నేతలు చాలా ప్రశాంతంగా, వివాదరహితంగా ఉంటే మరికొంతమంది నేతలు ఏమో ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి కొంతమందేమో టoగ్ స్లిప్ అయి మాట్లాడేస్తుంటారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఆయన ఇప్పటికే ..  ఫోన్ కాల్ లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన యువ కార్య కర్తను దూషించి నట్లు ఆడియో బయట పడ్డ సంగతి తెలిసిందే. 

ఇక ఇటీవల ఓ సర్పంచ్ ని కూడా బెదిరించినట్లు ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఇది ఇలా ఉండగా తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రసమయి బాలకిషన్. కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని... అలా మాట్లాడితే నాలుకలు తెగ కోస్తాం అని హెచ్చరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.  కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే రసమయి  ఇవాళ మీడియా సమావేశంనిర్వహించారు.  ఈ సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ నాయకులపై  ఘాటు వాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.  బండి సంజయ్ ది  విహారాయత్రనో ?  ఎం యాత్రనో తెలువదని చురకలు అంటించారు రసమయి.  

అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుందని.. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీం నగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ  ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. "నేను ఎమ్మెల్యే గా 20 కోట్ల నిధులు ఇచ్చినా.  ఎంపీ బండి సంజయ్ 20 రూపాయలు ఇచ్చినాడా" అన్నీ నిలదీశారు ఎమ్మెల్యే రసమయి బాల  కిషన్. మాటలు మర్యాదగా మాట్లాడకపోతే నాలుకలు తెగ కోస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: