తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఎలా ఉందొ చూశారు.. అదే పాలన నేను అందించగలను, అప్పటి పధకాలను అమలు చేసుకుందాం అంటూ ప్రజల ముందు తన పార్టీ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా కేవలం  తెరాస కుటుంబ అభివృద్ధి కోసమే జరుగుతుందని ఆమె విమర్శించారు. ఆ పార్టీ వచ్చినప్పటి నుండి ఏ వర్గానికి మేలు జరగకపోగా నష్టమే జరుగుతుందని ఆమె అన్నారు. ఇన్నేళ్ళలో ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజలకు ముఖం చూడకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయిన ముఖ్యమంత్రి అవసరమా అంటూ ఆమె ప్రజలను ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు కూడా హుజురాబాద్ ఉపఎన్నిక కోసం మాత్రమే బయటకు వచ్చి ప్రజల కోసం వచ్చినట్టు రంగు పులుముతున్నారు అన్నారు షర్మిల. ఆయనను ఎవరు ఏమి ప్రశ్నించినా వారిపై కేసులు పెడుతూ తమ అధికార మదాన్ని చూపించుకుంటూ బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. వైఎస్ కుటుంబానికి పోరాటాలు కొత్త కాదని, తెలంగాణాలో అధికార పార్టీ చేసే దాష్టికాలను ఎదిరించడానికి ఏ పోరాటం అయినా చేయడానికి సిద్ధంగా  ఉన్నట్టు అమ్మే చెప్పుకొచ్చారు. కేసులు పెట్టినా, జైల్లోనే వేసినా ప్రజల నుండి మాత్రం  తప్పించుకోవడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.  

స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వివాహం గురించి చెప్తూ, తన భర్తను సాధారణంగా స్నేహితులతో బయటకు వచ్చినప్పుడు కలిసినట్టు తెలిపారు. అయితే అప్పుడు చదువుకుంటున్నట్టు చెప్పారు ఆమె. అప్పటి పరిచయం ప్రేమగా మారింది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాకపోవచ్చని ఆమె అన్నారు. అనంతరం వివాహం కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారని, అందుకే ఇంట్లో ఒప్పించడానికి సమయం పట్టిందని ఆమె అన్నారు. అయితే కాస్త పోరాటం చేయకతప్పలేదని ఆమె అన్నారు. తనకు మొదటిగా ప్రపోస్ చేసిన వారు అనిల్ మాత్రమే అని ఆమె అన్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితం సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: