ప్రపంచం మొత్తం క‌రోనా మ‌హమ్మారితో అత‌లాకుత‌లం అయింది. ఈ క్ర‌మంలో అన్ని దేశాల శాస్త్ర‌వేత్త‌లు క‌లిసి కొవిడ్‌కు వ్యాక్సిన్ ను క‌నుగొన్నారు. ప్ర‌పంచంలో అభివృద్ధి చెందిన దేశాల‌తో స‌మానంగా భార‌త్ కూడా రెండు ర‌కాల వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. ఒక‌ప్పుడు దేశంలో వ్యాక్సిన్ దొర‌క‌ని ప‌రిస్థితి నుంచి ఇత‌ర దేశాల‌కు పంపించే స్థాయిలో భార‌త్ నిల‌బడింది. ఏ దేశానికి సాధ్యం కానీ రీతిలో అత్యంత జ‌నభా క‌లిగిన భార‌త్ త‌న స‌త్తాను చాటింది. మూడున్న‌ర కోట్ల‌కు పైగా క‌రోనా భారిన ప‌డ్డారు, నాలుగున్నర ల‌క్ష‌ల‌కు పైగా కొవిడ్‌తో మ‌ర‌ణించారు. అయినా ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయ‌కుండా ముందుకు సాగిపోయింది.

 
   కోట్లాది రూపాయ‌లు వెచ్చించి ప్ర‌జ‌ల‌కు ఉచితంగా టీకాను పంపిణీ చేస్తోంది. వ్యాక్సినేష‌న్ విషయంలో ఇప్ప‌టికే రికార్డు సృష్టించి ప్ర‌పంచ దేశాల కంటె ముంది నిలిచిన భార‌త్ మ‌రో  రికార్డును బ్రేక్ చేసే దిశంగా ముందుకు సాగుతుంది. నిన్న‌టి వ‌ర‌కూ సుమారు 97 కోట్లకు పైగా కొవిడ్ టీకాల‌ను పంపిణీ చేసింది భార‌త ప్ర‌భుత్వం. ఇంటింటికి వెళ్తూ క‌రోనా టీకాను అందిస్తోంది. టీకా విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిపిస్తోంది. అతి తొంద‌ర‌లో వంద కోట్ల వ్యాక్సిన్‌ల పంపిణీ  దిశ‌గా భార‌త్ దూసుకెళ్లుంది. జీ-7 దేశాల‌కు రెండు డోసుల వ్యాక్సిన్ ను భార‌త్ ఇప్ప‌టికే పంపిణీ చేసింది.

   
   ఒక‌ప్పుడు వ్యాక్సినేష‌న్ అవుతుందా లేదా అని అయోమ‌యంలో ఆందోళ‌న‌లో ఇప్పుడు ఏకంగా 100 కోట్ల వ్యాక్సిన్‌ల కు చేర‌కుని రికార్డు సృష్టించ‌బోతోంది. ఎలాంటి భారీ ప్ర‌చారం లేకుండా సాఫీగా వ్యాక్సినేష‌న్ ప్ర‌కియ కొన‌సాగ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. నిన్న‌టి వ‌ర‌కు దాదాపు 96 కోట్ల 70 ల‌క్ష‌ల వ‌ర‌కూ టీకాల పంపినీ చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే 68.61 కోట్ల మందికి మొద‌టి డోస్ అంద‌గా 27.21 కోట్ల మందికి రెండ‌వ డోసును పంపిణీ చేసింది భార‌త ప్ర‌భుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: